Justin Trudeau: భారత్‌ను రెచ్చగొట్టాలని చూడటం లేదు.. కెనడా ప్రధాని
భారత్‌ను రెచ్చగొట్టాలని చూడటం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే.
ఒటావా: ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) చేసిన ఆరోపణలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ట్రూడో మరోసారి స్పందించారు. భారత్‌ను తాము రెచ్చగొట్టాలని, లేదా ఉద్రిక్తతలు పెంచాలని చూడటం లేదంటూ వ్యాఖ్యానించారు. సిక్కు నేత హత్యను అత్యంత తీవ్రంగా పరిగణించాలని భారత్‌ను కోరుతున్నామన్నారు.
ప్రతి విషయం స్పష్టంగానే ఉందని, సరైన ప్రక్రియలో సాగుతోందని నిర్ధరించుకునేందుకు భారత్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు ట్రూడో తెలిపారు. ఇదిలా ఉండగా.. నిజ్జర్ హత్య కేసు వ్యవహారంలో భారత రాయబారిపై కెనడా బహిష్కరణ వేటువేసింది. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన భారత్.. కెనడా దౌత్యవేత్తను బహిష్కరించి, గట్టి బదులిచ్చింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగినట్లయ్యింది. ఈ పరిణామాల నడుమ ట్రూడో మరోసారి మాట్లాడారు.
మహిళా ఎంపీనే తోసిన ప్రధాని.. ట్రూడో చుట్టూ వివాదాలెన్నో..!
ఖలిస్థానీ సానుభూతిపరుడు, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చనడానికి విశ్వసనీయమైన సమాచారం ఉందని ట్రూడో ఆరోపించారు. ఈ క్రమంలోనే కెనడాలోని భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు పడింది. కెనడాలోని భారత దౌత్యకార్యాలయంలోని రీసెర్చి అండ్ ఎనాలసిస్ వింగ్ అధిపతిని బహిష్కరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలను భారత విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సముద్రంలో 36 గంటలు.. గణపతి విగ్రహ చెక్కబల్లే ఆధారంగా..
-
జాగ్రత్త.. ఎండార్స్ చేసినా కేసులు పెడుతున్నారు
-
పవన్ పర్యటన నేపథ్యంలో.. అర్ధరాత్రి హడావుడిగా రహదారి పనులు!
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు
-
పసుపు బోర్డు ప్రకటన వచ్చె.. ఈ రైతు కాళ్లకు చెప్పులు తెచ్చె
-
ఎత్తిపోసేందుకు.. తెచ్చిపోశారు