Maldives: మాల్దీవుల అధ్యక్షుడి అభిశంసనకు విపక్షాలు సిద్ధం..!

మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుపై అభిశంసన అస్త్రాన్ని ప్రయోగించేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. 

Updated : 29 Jan 2024 15:48 IST

మాలె: మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు(President Mohamed Muizzu)పై ఆ దేశ పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి అవసరమైన సంతకాలను ప్రతిపక్ష పార్టీలు సేకరించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈక్రమంలో పార్లమెంట్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇతర  పార్టీలతో కలిసి తాము సంతకాలు సేకరించినట్లుగా ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్‌ డెమొక్రటిక్‌ పార్టీ(MDP) ఎంపీ చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి.

అధికార, విపక్ష ఎంపీల తోపులాటలు, ముష్టిఘాతాలతో మాల్దీవుల పార్లమెంట్‌ అట్టుడికిన తరుణంలో ఈ వార్తలు వెలుగులోకి రావడం గమనార్హం. మాల్దీవుల కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంపై పార్లమెంటులో ఆదివారం ఓటింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు. పోడియం పైకి వెళ్లిన కొందరు సభ్యులు స్పీకర్‌ కార్యకలాపాలను అడ్డుకున్నారు. మరికొందరు సభ్యులూ అక్కడికి చేరుకొని స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. బెంచీల పైనుంచి దూసుకెళ్లి స్పీకర్‌ను తోసివేసే ప్రయత్నం చేశారు. అనంతరం ఎంపీలు ఒకరిపైఒకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని