Harry and Markle: ప్రిన్స్ హ్యారీ దంపతులను వెంటాడిన మీడియా.. క్యాబ్ డ్రైవర్ ఏమన్నారో తెలుసా?
క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా మీడియా ప్రతినిధులు వెంబడించడంతో ప్రిన్స్ హ్యారీ (Prince Harry) దంపతులు తీవ్ర ఇబ్బందికి గురైన సంగతి తెలిసిందే. అయితే, ఆ సమయంలో ఎదురైన అనుభవాన్ని క్యాబ్ డ్రైవర్ సుక్‌చరణ్ సింగ్ మీడియాకు తెలిపారు.
న్యూయార్క్: బ్రిటన్ రాజు ఛార్లెస్ రెండో తనయుడు హ్యారీ(Harry), ఆయన సతీమణి మెర్కెల్‌ను (Meghan Markle) మీడియా ప్రతినిధులు (పాపరాజీ) కారులో వెంటాడి నరకం చూపించిన సంగతి తెలిసిందే. హ్యారీ దంపతులతోపాటు మెర్కెల్ తల్లి డోరియా రగ్లాడ్ వారి నుంచి తప్పించుకునేందుకు మన్‌హట్టన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. సర్దిచెప్పిన పోలీసులు వాళ్లను తిరిగి క్యాబ్‌లో పంపించారు. ఆ క్యాబ్ డ్రైవర్ ఇండో అమెరికన్ సుఖ్‌చరణ్ సింగ్ తమకు ఎదురైన అనుభవాన్ని మీడియాకు తెలిపారు. పోలీస్‌స్టేషన్ నుంచి బయల్దేరిన 10 నిమిషాల్లో మళ్లీ మీడియా ప్రతినిధులు వెంబడించినట్లు చెప్పారు. దీంతో హ్యారీ దంపతులు చాలా భయపడ్డారని వారి సూచన మేరకు తిరిగి క్యాబ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చేశానని అన్నారు.
‘‘ నేను 67 స్ట్రీట్‌లో ఉన్నాను. ఓ సెక్యూరిటీ అధికారి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌కు రమ్మన్నారు. ఆ తర్వాత హ్యారీ దంపతులతోపాటు డోరియా రగ్లాడ్ క్యాబ్‌లోకి వచ్చారు. మేం ట్యాక్సీలో వెళ్తుండగా.. చెత్త తరలించే వాహనం అడ్డువచ్చింది. దీంతో అక్కడ ఆగాల్సి వచ్చింది. ఇంతలో మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా వచ్చేశారు. ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. దీంతో హ్యారీ దంపతులు ట్యాక్సీని తిరిగి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాల్సిందిగా కోరారు. మేం పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వరకు వాళ్లంతా మమ్మల్ని వెంబడించారు. హ్యారీ దంపతులు చాలా మంచివారు. మీడియా ప్రతినిధుల ప్రవర్తనతో ఒకింత భయానికి గురయ్యారు. నేను వాళ్లను పోలీస్‌స్టేషన్ వద్ద విడిచిపెట్టి వచ్చేశాను’’ అని క్యాబ్ డ్రైవర్ సుఖ్‌చరణ్ సింగ్ తెలిపారు.
మంగళవారం రాత్రి ప్రిన్స్ హ్యారీ దంపతులకు ఎదురైన అనుభవం గురించి వారి అధికార ప్రతినిధి బుధవారం మీడియాకు వివరించారు. ఒక అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం హ్యారీ, మెర్కెల్, ఆమె తల్లి డోరియా రగ్లాడ్‌లు వెళ్తుండగా మీడియా ప్రతినిధులు వెంబడించారు. ఈ క్రమంలో ఇతర కార్లను, పాదచారులను, ఇద్దరు న్యూయార్క్ పోలీసులను ఢీకొట్టబోయారని, త్రుటిలో ప్రమాదాలు తప్పాయని హ్యారీ దంపతుల అధికార ప్రతినిధి వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన చిత్రాల్లో హ్యారీ, మెర్కెల్, రగ్లాడ్ ట్యాక్సీలో ఉన్నట్లు కనిపించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Rana Naidu: ఎట్టకేలకు ‘రానానాయుడు’ సిరీస్‌పై స్పందించిన వెంకటేశ్
-
Crime News
ఎల్బీనగర్లో భారీ అగ్ని ప్రమాదం.. భారీ నష్టంతో సొమ్మసిల్లి పడిపోయిన యజమాని
-
Ap-top-news News
రూ.99కే కొత్త సినిమా.. విడుదలైన రోజే ఇంట్లో చూసే అవకాశం
-
Ap-top-news News
జులై 20న విజయనగరంలో ‘అగ్నివీర్’ ర్యాలీ
-
India News
మృతదేహంపై కూర్చుని అఘోరా పూజలు
-
India News
దిల్లీలో బయటపడ్డ 2,500 ఏళ్లనాటి అవశేషాలు