China Spying: బ్రిటన్‌లో చైనీయుల గూఢచర్యం..! రిషి సునాక్‌ ఆందోళన

బ్రిటన్‌లో కొందరు చైనీయులు గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు వెలుగు చూడటం సంచలనం రేపింది.

Published : 10 Sep 2023 17:44 IST

లండన్‌: బ్రిటన్‌లో కొందరు చైనీయులు నిఘా కార్యకలాపాలకు (Spying) పాల్పడుతున్నారనే ఆరోపణలు ఇటీవల వెలుగు చూశాయి. ఇద్దరు వ్యక్తులు గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు బ్రిటన్‌ మీడియా పేర్కొనడం అక్కడ సంచలనం రేపింది. ఇలా బ్రిటన్‌ పార్లమెంటరీ ప్రజ్వాస్వామ్యంలో చైనా జోక్యంపై ఆ దేశ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో జరిగిన జీ20 సదస్సు (G20 Summit) సందర్భంగా ఈ విషయాన్ని చైనా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

బ్రిటన్‌ రహస్య చట్టాల కింద ఇటీవల అక్కడ ఇద్దరు చైనీయులు అరెస్టయినట్లు యూకే మీడియా వెల్లడించింది. పార్లమెంటరీ పరిశోధకుడిగా ఓ వ్యక్తి బ్రిటన్‌లో గూఢచర్యానికి పాల్పడుతున్నారనే వార్తలు వినిపించాయి. ఇందులో 20ఏళ్లకుపైగా వయసున్న ఓ యువకుడు పరిశోధన పేరుతో కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన అనేక మంది ఎంపీలతో పరిచయం ఏర్పరచుకున్నట్లు సమాచారం. మరో వ్యక్తి (30) కూడా ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో వారిద్దర్నీ మార్చిలో బ్రిటన్‌ పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు లండన్‌లో ఉంటున్న వారి ఇళ్లపై పోలీసులు సోదాలు చేశారు.

మా దేశానికి వస్తే పుతిన్‌ను అరెస్టు చేయబోం: బ్రెజిల్‌

బ్రిటన్‌ పార్లమెంటరీ వ్యవస్థపై పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా తరఫున చొరబాటు యత్నాలు జరుగుతున్నాయనే వార్తలు రావడంపై బ్రిటన్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇదే విషయాన్ని భారత పర్యటనలో ఉన్న చైనా ప్రధానమంత్రి లీ కియాంగ్‌తో భేటీ సందర్భంగా చర్చించినట్లు బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం (10 Downing Street) అధికారప్రతినిధి వెల్లడించారు. దీనిపై చైనా స్పందన మాత్రం తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని