Rishi Sunak: టీవీ చర్చలో సునాక్‌కు విజయం

బ్రిటన్‌ ప్రధాని అభ్యర్థి రిషి సునాక్‌ తన ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌పై తాజాగా నిర్వహించిన ఓ ముఖాముఖి టీవీ చర్చలో విజయం సాధించారు. వీరిద్దరూ పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధానమంత్రి స్థానానికి పోటీలో

Updated : 06 Aug 2022 08:19 IST

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని అభ్యర్థి రిషి సునాక్‌ తన ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌పై తాజాగా నిర్వహించిన ఓ ముఖాముఖి టీవీ చర్చలో విజయం సాధించారు. వీరిద్దరూ పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధానమంత్రి స్థానానికి పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ‘బ్యాటిల్‌ ఫర్‌ నంబరు 10’ పేరిట స్కై న్యూస్‌ ఛానల్‌ గురువారం రాత్రి కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల నడుమ తుది అభ్యర్థులిద్దరి మధ్య చర్చ నిర్వహించింది. ఈ సందర్భంగా సునాక్‌, ట్రస్‌లు తామెందుకు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ స్థానంలోకి రావల్సిన ఆవశ్యకత ఉందో వివరించారు. చర్చలో ఎవరు విజయం సాధించారనే విషయంపై నిర్వహించిన ఎన్నికలో సునాక్‌కే పార్టీ సభ్యులు ఆధిక్యం కట్టబెట్టారు. ఇటీవల చేపట్టిన పలు ఒపీనియన్‌ పోల్స్‌లో ట్రస్‌ కంటే బాగా వెనుకబడిన సునాక్‌కు తాజా విజయం ఉత్సాహాన్నిస్తుందని చెప్పొచ్చు. చివరగా పార్టీ సభ్యుల మధ్య నిర్వహించిన సర్వేలో సునాక్‌ కంటే ట్రస్‌ 32 శాతం ఆధిక్యంలో ఉన్నారు. ఈ క్రమంలో ఏ క్షణంలోనైనా ప్రధానమంత్రి పదవి రేసు నుంచి మీరు వైదొలుగుతారా? అని సునాక్‌ను ప్రేక్షకులు ప్రశ్నించారు. దీనికి ఆయన వెంటనే.. అలా జరగదు అని సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా తాను విశ్వసిస్తున్న అంశం కోసం పోరాడుతున్నానని, తన ఆలోచనలను దేశవ్యాప్తం చేస్తున్నానని బదులిచ్చారు. అధిక పన్నుల వల్లే మాంద్యం ముంచుకొస్తోందన్న వాదనను తోసిపుచ్చుతూ.. ద్రవ్యోల్బణం కారణంగానే మాంద్యం పరిస్థితులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని