Robo taxi: అనైతిక కార్యకలాపాలకు వేదికగా రోబో ట్యాక్సీలు..!

అమెరికాలోని కాలిఫోర్నియాలో రోబో ట్యాక్సీలు అనైతిక కార్యకలాపాలకు వేదికగా మారడంపై పలువురు విమర్శిస్తున్నారు.

Updated : 31 Aug 2023 08:41 IST

కాలిఫోర్నియా: రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతోన్న సాంకేతిక పరిజ్ఞానంతో అనేక లాభాలుండగా.. కొంతమంది మాత్రం వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇటీవలే అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో రోబో ట్యాక్సీలకు అనుమతి లభించింది. ఈ ట్యాక్సీల ప్రత్యేకత ఏంటంటే ఇందులో డ్రైవర్‌ ఉండరు. మనం బుక్‌చేసిన వెంటనే లోకేషన్‌కు చేరుకొని మనం కూర్చున్న తరువాత గమ్యానికి చేరుస్తుంది. ఫుల్‌ ఆటోమేటిక్‌గా నడిచే ఈ వాహనాలను రాత్రి మాత్రమే నడిపేందుకు అనుమతులు జారీ చేశారు.

అనేక మందికి ప్రయోజనం.. కానీ..!

రాత్రి పూట డ్యూటీలు చేసేవారికి ఈ ట్యాక్సీలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటున్నాయి. అర్ధరాత్రి విధులు ముగించుకొని లేదా రాత్రివేళ్లల్లో ఎయిర్‌పోర్టులకు వెళ్లేవారికి ఈ సదుపాయం ఎంతో సౌకర్యంగా ఉంటోంది. అయితే కొందరు వీటిని తమ అనైతిక కార్యకలాపాలకు, ఇతర అసభ్యకరమైన పనులకు వాడుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ట్యాక్సీలు విశాలంగా ఉండటంతో పాటు వెనక సీట్లలో ఇటువంటి అసభ్యకరమైన పనులకు పాల్పడుతున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

వారిపై నిఘా ఉంటుంది..

ఈ ట్యాక్సీల్లో ప్రయాణికుల భద్రత కోసం అన్ని నిఘా కెమెరాలు ఉంటాయని ట్యాక్సీ వర్గాలు తెలిపాయి. వీటిపై కమాండ్‌ కేంద్రం నుంచి పూర్తి నిఘా ఉంటుందని వెల్లడించాయి. అసభ్య కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే హెచ్చరించే వ్యవస్థ ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

మాకు చాలా సౌకర్యంగా ఉంది..

అయితే కొన్ని జంటలు మాత్రం ఈ క్యాబ్‌ సౌకర్యంగా ఉందని సంతోషం వ్యక్తంచేశాయి. తమ అనైతిక కార్యకలాపాలకు వేదికగా ఇవి సౌకర్యంగా ఉన్నాయని చెబుతున్నాయి. ట్యాక్సీలను శుభ్రంగా ఉంచాలని నిబంధనల్లో ఉన్నాయని అయితే శృంగారం చేయకూడదన్న నిబంధన ఏదీ లేదని కొందరు పేర్కొంటున్నారు. దీంతో తలపట్టుకున్న క్యాబ్‌ ప్రతినిధులు తాజాగా కొత్త నిబంధనలు రూపొందించేందుకు సిద్ధమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు