Russia: కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 15 మంది మృతి

రష్యాలో మరో సైనిక రవాణా విమానం కూలిపోయింది. మూడు నెలల వ్యవధిలో ఇది రెండో ఘటన.

Published : 12 Mar 2024 23:37 IST

మాస్కో: రష్యా (Russia)లో సైనిక రవాణా విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. మంగళవారం రక్షణశాఖకు చెందిన ఇల్యుషిన్‌ ఐఎల్‌-76 అనే రవాణా విమానం రష్యాకు పశ్చిమంగా ఉన్న ఎయిర్‌బేస్‌ నుంచి టేకాఫ్‌ అయింది. తర్వాత కొద్దిసేపటికే ఇవనోవో ప్రాంతంలో కూలిపోయిందని మాస్కో ఓ ప్రకటనలో తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో 8 మంది సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు ఉన్నారని పేర్కొంది. వీరంతా మృతి చెందినట్లు ప్రకటించింది. విమానం కూలిపోతున్న సమయంలో కుడివైపు ఇంజిన్‌ నుంచి దట్టమైన పొగ వెలువడినట్లు వీడియోలో కనిపించింది.

అప్పుడలా.. ఇప్పుడిలా.. టిక్‌టాక్‌పై మారిన ట్రంప్ స్వరం

విమానం కూలిపోతున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.  ఈ ప్రమాదానికి ఉగ్రదాడి కారణమా? లేక సాంకేతిక సమస్యతో కూలిపోయిందా?అనేది తెలియాల్సివుంది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. రష్యాకు చెందిన సైనిక విమానం కుప్పకూలడం మూడు నెలల వ్యవధిలో ఇది రెండో ఘటన. ఈ ఏడాది జనవరిలో 65 మంది ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలు, తొమ్మిది మంది సిబ్బందితో వెళుతున్న విమానం కూలిపోయింది. దీన్ని ఉక్రెయిన్‌ కూల్చివేసినట్లు రష్యా ఆరోపించింది. అయితే, అందులో యుద్ధ ఖైదీలు లేరని, రష్యా క్షిపణులను తరలించిందని ఉక్రెయిన్‌ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని