మోదీ పట్టుదలతోనే ఓబీసీ కమిషన్‌కు అధికారాలు

ప్రధానాంశాలు

మోదీ పట్టుదలతోనే ఓబీసీ కమిషన్‌కు అధికారాలు

భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌

ఈనాడు, దిల్లీ: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పట్టుదలతోనే ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత వచ్చి అధికారాలు దక్కాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. దిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన భాజపా జాతీయ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన శనివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. దేశాన్ని 60 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్‌ ఓబీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుందని విమర్శించారు. గతంలో ఆర్టికల్‌ 340 ప్రకారం ఓబీసీ కమిషన్‌ ఏర్పాటైనా కోరలు లేకుండా చేశారన్నారు. తెలంగాణ సహా ప్రతి రాష్ట్రంలో బీసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. పలు రాష్ట్రాల్లో ముస్లింలను ఓబీసీల జాబితాలో చేర్చి ఓబీసీల ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీసీల హక్కుల పరిరక్షణకు ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఓబీసీ మోర్చా జిల్లా, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా బలోపేతం కావాలని జాతీయ పదాధికారుల సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. తెలంగాణలో బీసీలను అణచివేస్తూ కేసీఆర్‌ అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తామన్నారు.ఓబీసీల కోసం మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు, చేపట్టిన పనులను వివరించేందుకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. రానున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓబీసీల మద్దతు కూడగట్టేందుకు తమ మోర్చా యత్నిస్తుందని ఆయన చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని