పేలుడు పదార్థాల సరఫరా పెంచండి

ప్రధానాంశాలు

పేలుడు పదార్థాల సరఫరా పెంచండి

సరఫరా కంపెనీలకు సింగరేణి సూచన

ఈనాడు, హైదరాబాద్‌: బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా యంత్రాల పని గంటలను పెంచాలని, ఇందుకోసం గనుల తవ్వకాల్లో వాడే పేలుడు పదార్థాల సరఫరాను పెంచాలని సంబంధిత కంపెనీలను సింగరేణి కోరింది. పేలుడు పదార్థాల తయారీదారులు, సరఫరాదారులతో సింగరేణి డైరెక్టర్లు ఎస్‌.చంద్రశేఖర్‌, ఎన్‌.బలరాం, డి.సత్యనారాయణరావు శనివారం సమావేశం నిర్వహించారు. గనుల్లో రోజుకు 14 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి వెలికితీయాల్సి ఉంటుందని, తద్వారానే 7 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని వారు పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని