రాష్ట్రంలో 207 కరోనా కేసులు

ప్రధానాంశాలు

రాష్ట్రంలో 207 కరోనా కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 207 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇద్దరు మృతి చెందారు. వీరితో కలిపి ఇప్పటివరకు మహమ్మారి బారిన 3,946 మంది ప్రాణాలు విడిచారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 38 కేసులు, కరీంనగర్‌ జిల్లాలో 22, రంగారెడ్డి 17, ఖమ్మం 15, మంచిర్యాల 13, హనుమకొండ 12, సూర్యాపేట, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో తొమ్మిదేసి చొప్పున కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 6,70,139కు చేరుకుంది. రాష్ట్రంలో కొవిడ్‌తో చికిత్స పొందుతున్న వారు 3,984 మంది ఉండగా 184 మంది కోలుకున్నారు. శనివారం 42,108 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని