మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు

ప్రధానాంశాలు

మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, మంచిర్యాల సిటీ, జ్యోతినగర్‌, న్యూస్‌టుడే: మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో శనివారం పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. మధ్యాహ్నం 2.03 గంటలకు రెండు సెకన్లపాటు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై 3.3గా తీవ్రత నమోదైనట్లు ఎన్‌జీఆర్‌ఐ భూకంప అధ్యయన కేంద్రం శాస్త్రవేత్త రవికుమార్‌ తెలిపారు. కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందన్నారు. మంచిర్యాలకు దక్షిణ, నైరుతి దిశల మధ్యలో 4కి.మీ. దూరం, పెద్దపల్లికి ఉత్తర, ఈశాన్య దిశల్లో 25కి.మీ. దూరంలో కంపనం సంభవించినట్లు గుర్తించామన్నారు. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, నస్పూర్‌, జైపూర్‌ మండలాతో పాటు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ సమీపంలోని కృష్ణానగర్‌, నర్రశాలపల్లి, రామయ్యపల్లి, మల్కాపూర్‌ ప్రాంతల్లో భూమి కంపించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని