ఆ మాత్రలు పుట్టబోయే బిడ్డకు మంచివి కాదా? - expert advise on periods postponement and pregnancy in telugu
close
Published : 18/07/2021 13:34 IST

ఆ మాత్రలు పుట్టబోయే బిడ్డకు మంచివి కాదా?

హలో మేడమ్‌. నేను ఇటీవలే పలు కారణాల వల్ల పిరియడ్స్‌ వాయిదా వేసుకున్నాను. ఇందుకోసం ఆన్‌లైన్‌లో డాక్టర్‌ను సంప్రదించి Meprate 10 mg మాత్రలు రోజుకు రెండు చొప్పున పది రోజుల పాటు వాడాను. అయితే మాత్రలు ఆపేసినా నెలసరి రాకపోయే సరికి యూరిన్‌ ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకున్నా. పాజిటివ్‌ వచ్చింది. ఇప్పుడు ఏడు వారాల గర్భిణిని. స్కాన్‌లో అంతా బాగానే ఉందన్నారు. కానీ ఈ మాత్రల వల్ల పుట్టబోయే బిడ్డలో ఏవైనా లోపాలొస్తాయేమోనని భయంగా ఉంది. దయచేసి సలహా ఇవ్వగలరు.

- ఓ సోదరి

జ. Meprate మాత్రలు గర్భం ధరించిన ప్రారంభ దశలో వాడినప్పుడు గర్భస్థ శిశువుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్న అంశం మీద చాలా అధ్యయనాలు జరిగాయి. అయితే వీటిలో చాలా వరకు పుట్టబోయే బిడ్డ మీద ఎలాంటి ప్రభావం ఉండదనే చెబుతున్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం గర్భస్థ శిశువుకి జననేంద్రియాల్లో లోపాలు రావచ్చని పేర్కొన్నాయి. అందుకని పుట్టబోయే బిడ్డలో కచ్చితంగా ఎలాంటి లోపాలు రావు అన్న గ్యారంటీ ఎవ్వరూ ఇవ్వలేరు. ఈ లోపాలు స్కాన్‌లో బయటపడకపోవచ్చు కూడా! కాబట్టి దానికి సంబంధించిన నిర్ణయం మీరే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక సలహా ఏంటంటే.. గర్భం నిలిచే అవకాశం ఉన్నప్పుడు పిరియడ్స్‌ని వాయిదా వేయడానికి ఇలాంటి మాత్రలు వాడడం మంచిది కాదు. ఒకవేళ వాడాల్సి వస్తే Meprate కాకుండా.. గర్భస్థ శిశువుపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపని వేరే రకం ప్రొజెస్టిరాన్‌ని డాక్టర్‌ సలహా మేరకు వాడడం మంచిది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని