కాళ్లకి వెనిగర్‌ రక్షణ
close
Published : 06/06/2021 00:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాళ్లకి వెనిగర్‌ రక్షణ

చర్మ రక్షణలో కాళ్లకి ప్రాధాన్యమిచ్చేవారు అరుదు. కానీ వేసవిలో చెమట పాదాలపైనా ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా ఎన్నో సమస్యలు. వాటన్నింటికీ వెనిగర్‌తో చెక్‌ పెట్టేయొచ్చు. అదెలానో చూడండి...
షూ వేసుకునే అలవాటున్న కొందరిలో సాక్సు విప్పగానే దుర్వాసన వస్తుండటం గమనించే ఉంటారు. చెమటతో బాక్టీరియా కలవడమే ఇందుకు కారణం. వెనిగర్‌.. బ్యాక్టీరియా, ఫంగైలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. చల్లటి నీటిలో పావు కప్పు వెనిగర్‌ వేసి, పాదాలను 5 నిమిషాలు అందులో ఉంచండి. ఇలా తరచూ చేస్తుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
* పొడిబారిన పాదాలు, పగుళ్లు నొప్పి, దురదలకు కారణమవుతాయి. వెనిగర్‌లో ఉండే యాసిడ్లు పాదాలకు తేమతోపాటు మృదుత్వాన్నీ అందిస్తాయి. పగుళ్లకూ ఇది మందు.
* కొందరిలో చెమట కారణంగా కాలి వేళ్లమధ్య ఇన్ఫెక్షన్లు, చిన్న కురుపుల్లాంటివి వస్తుంటాయి. వెనిగర్‌లోని యాంటీ ఫంగల్‌ ఇందుకు చక్కగా పనిచేస్తుంది. గ్లాసు నీటిలో పావు కప్పు వెనిగర్‌ను కలిపి దూదితో సమస్య ఉన్నచోట రాసుకుంటే చాలు.


మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని