గొడవ తెగనివ్వండి!
close
Published : 04/09/2021 02:24 IST

గొడవ తెగనివ్వండి!

భార్యాభర్తల అనుబంధంలో చిన్నచిన్న మనస్పర్థలు సహజమే కానీ అవి త్వరగా సమసిపోవాలంటే సర్దుబాట్లు తప్పనిసరి.

లుమగలు కష్టసుఖాల్ని సమానంగా పంచుకోవాలి. ఒకరు ఒత్తిడికి లోనవుతున్నప్పుడు మరొకరు నేనున్నానే భరోసా ఇవ్వాలి. చేతల ద్వారా చూపించాలి. అంటే పక్కన కూర్చుని భుజాన చేయి వేయడం, చేతిలో చేయి వేసి ధైర్యాన్నివ్వడం వంటివి చేయాలి. ఇవన్నీ అనుబంధంలో నమ్మకాన్ని పెంచుతాయి.

* వాదనలూ, గొడవపడటం.. లాంటివన్నీ భార్యాభర్తలకు సహజమే. అయితే కొన్ని వాదనలు ఎంతకీ తెగవు. అలాంటప్పుడు అదేపనిగా వాదించుకోవడం, మాట్లాడుకోవడం మానేయడం కాకుండా ‘మనం ఈ వాదనను వాయిదా వేద్దామా..’ అనేయండి. దానివల్ల సమస్య కొన్నాళ్లకు వాయి దా పడుతుంది. మీ మధ్య దూరం కూడా పెరగదు. అంతే కాదు.. తొందరపాటు నిర్ణయం కూడా తీసుకోకుండా ఉంటారు.

* పెళ్లయిన కొత్తల్లో భాగస్వామి మీద ఉన్న ప్రేమంతా చేతల్లో, మాటల్లో ఎంతో ఇష్టంగా చూపిస్తూనే ఉంటాం. కానీ ఏళ్లు గడిచేకొద్దీ అలా చెప్పడం తగ్గిపోతుంది. కానీ మీరు మాత్రం ఆ పనిచేయకండి. సందర్భం దొరికినప్పుడు ప్రేమను వ్యక్తపరచండి. అదే మీ బంధాన్ని సజీవంగా ఉంచుతుంది.మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని