పిల్లలు ఫోన్‌ వదలడం లేదా?
close
Published : 28/09/2021 01:07 IST

పిల్లలు ఫోన్‌ వదలడం లేదా?

మూడేళ్ల పిల్లల దగ్గర్నుంచీ ముప్పయ్యేళ్ల అమ్మాయిల దాకా టీవీ, ఫోన్‌లకు అతుక్కుపోతున్నారనేది మనందరికీ తెలిసిన సంగతే. చిన్నారులైతే చదువుకు ఆటంకం కలుగుతుందని, ఎదిగిన పిల్లలయితే వృత్తి ఉద్యోగాల్లో పైకి రాలేరని అమ్మలందరి బాధా భయమూ.. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కొన్ని నియమాలు పెట్టి కొంత కఠినంగా వ్యవహరించక తప్పదంటున్నారు మానసిక నిపుణులు.

పిల్లల ఫోనుల్లో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ అకౌంట్లను అన్‌ ఇన్‌స్టాల్‌ చేయండి. లేదా నెట్‌ యాక్సెస్‌ లేకుండా చేయండి. అదనపు ఫీచర్లను బ్లాక్‌ చేయండి. అనవసర యాప్స్‌ను తొలగించేయండి.

అత్యవసర మాటలూ మెసేజీలకే ఫోన్‌ పరిమితమని కచ్చితంగా చెప్పండి. మొబైల్‌ను ఆడియో బుక్స్‌, వీడియో స్టోరీస్‌ లాంటి మెదడును వికసింపచేసే అంశాలకు వినియోగించేలా చూడండి.

వీడియో గేమ్స్‌ లాంటివి కూడా రోజులో కొద్దిసేపేనని నిబంధన పెట్టండి. కేటాయించిన సమయానికి మించి స్క్రీన్‌ టైం ఉంటే అడిగిన దుస్తులు లేదా వస్తువులు కొనివ్వమంటూ గట్టిగా ఆంక్షలు పెట్టండి.

మొబైల్‌కి అలవాటు పడితే కళ్లకి ఇబ్బందే కాదు మానసిక అనారోగ్యాలూ వస్తున్నాయని, చాటింగులూ షేరింగుల వల్ల కాలం చాలా వృథా అవుతుందని, గడిచిన క్షణం కూడా వెనక్కి రాదని విడమర్చి చెప్పండి. ఏదైనా ఉదాహరణలతో చెబితే బాగా అర్థమవుతుంది.

అరచేతిలో ప్రపంచాన్ని చూపే ఫోన్‌లో విజ్ఞాన వినోదాలతో బాటు వికారాలూ వైపరీత్యాలూ అపారమని వివరంగా చెప్పండి.  

పిల్లలకు ఈ మాత్రం జాగ్రత్తలు చెప్పకపోతే వాళ్లు గాడి తప్పిన తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదని హెచ్చరిస్తున్నారు సైకాలజిస్టులు.


Advertisement


మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని