ఇలా వాడుతున్నారా? అయితే జాగ్రత్త!
close
Published : 06/07/2021 00:25 IST

ఇలా వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

అందంగా కనిపించాలని రోజూ వాడే కొన్నింటివల్ల దీర్ఘకాలంలో అనారోగ్యాల ముప్పు ఉండొచ్చు. అవేంటో తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. మేలు. అవేంటంటే!

పరిశుభ్రంగా... సందర్భం ఎంత చిన్నదైనా...మోముని మెరిపించుకోవడానికి ఇప్పుడు అందరూ తప్పనిసరిగా మేకప్‌ని వాడుతున్నారు. నాణ్యమైన ఉత్పత్తులు వాడకపోయినా, గడువు దాటినవీ, ఇతరులవీ వాడితే చర్మ సంబంధిత సమస్యలు రావొచ్చు. అలానే ఎక్కువ సమయం ఉంచుకోవడం, రాత్రి తొలగించుకోకుండా పడుకోవడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. వీలైనంత తక్కువగా మేకప్‌ వేసుకోవడంతో పాటు నాణ్యమైన రకాల్ని పరిశుభ్రమైన విధానాల్లో వాడటం మంచిది.

వదులుగా... శరీరానికి అతుక్కుపోయేలా డ్రెస్‌లు, లెగ్గింగ్‌లు, ప్యాంట్లు ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. చెమట వల్ల చర్మ, తదితర సమస్యలు రావొచ్చు. క్లోజ్డ్‌ ఫిట్టింగ్‌ స్కర్టులు, బాడీషేపర్ల వల్ల నరాలు, కండరాల నొప్పులు, డిస్క్‌ సమస్యలు రావొచ్చు. వీలైనంతవరకూ వీటి జోలికి పోవద్దు. కాస్త వదులుగా ఉండేలా చూసుకోవడం వల్ల ఈ ఇబ్బందిని తొలగించుకోవచ్చు.

తక్కువ సమయం... ట్రెండ్‌, మ్యాచింగ్‌ల పేరుతో ఫ్యాషన్‌ జ్యూయలరీని విరివిగా వాడుతోంది ఈ తరం. కొందరిలో అలర్జీల కారణంగా ఆ ప్రాంతంలో కమిలిపోవడం, నల్లగా మారడం, చీము పట్టడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక బరువైనవి ఎంచుకోవడం వల్ల చెవి తమ్మి సాగిపోయే ప్రమాదం ఉంది. గిల్టు నగలు పడనివారు...నేరుగా పెట్టుకోకుండా వాటి శీలలకు నెయిల్‌పెయింట్‌ వేయడం వల్ల కొంతవరకూ ప్రభావాన్ని తగ్గించొచ్చు. బరువైనవాటిని తక్కువ సమయం మాత్రమే ధరించేలా చూసుకోండి.

బరువొద్దు... ఇప్పుడు అందరికీ హ్యాండ్‌బ్యాగ్‌ నిత్యావసరం అయిపోయింది. కానీ కొందరి బ్యాగు చూస్తే కనీసం మూడు నుంచి ఐదు కిలోల బరువుంటుంది. కనిపించిన ప్రతివస్తువూ ముఖ్యమే అనుకుని వెంట పెట్టుకుని తిరగడమే ఇందుకు కారణం.

ఫలితంగా ...మెడ, భుజాలు, వెన్నుపై తీవ్ర ప్రభావం పడొచ్చు. అందుకే వీలైనంత తేలిగ్గా ఉండేలా చూసుకోండి.

ఎత్తొద్దు... ఎత్తు చెప్పుల్ని దీర్ఘకాలం వాడితే పాదాల ఆరోగ్యం దెబ్బతింటుంది. రక్తప్రసరణలో హెచ్చు తగ్గుల వల్ల మడమలు, కీళ్లు, కండరాల నొప్పులు తీవ్రమవుతాయి. నడవడానికే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎక్కువ సమయం వాడొద్దు. అవకాశం ఉన్నప్పుడు వాటిని తీసి పక్కన పెట్టి వట్టి పాదాలతోనే నడవడం మంచిది. దూర ప్రయాణాల్లో వీటికి ప్రాధాన్యం ఇవ్వొద్దు. సరైన రోడ్లు లేని చోట్ల కూడా వాడకపోవడమే మంచిది.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని