కెరియర్‌ బాధ్యతను తీసుకోండి!
close
Updated : 27/10/2021 06:23 IST

కెరియర్‌ బాధ్యతను తీసుకోండి!

కోర్సు, కాలేజీ సహా అమ్మాయిల విషయంలో నిర్ణయం కుటుంబానిదే అవుతుంది. ఇలా అన్ని అంశాలనూ ఇంట్లో వాళ్లకే వదిలేస్తే... ఇబ్బందిపడతారంటున్నారు నిపుణులు. ఎందుకంటే దేశీయమైనా, విదేశీయమైనా ఉన్నత చదువులకు ఇంటర్వ్యూలు తప్పనిసరి అవుతున్నాయి.
ఈ తరహా ఇంటర్వ్యూల్లో అభ్యర్థి జ్ఞానాన్ని పరీక్షించడానికే పరిమితమవరు. కోర్సు, విద్యాసంస్థపై ఉన్న ఆసక్తి వగైరాలనూ పరిశీలిస్తారు. ‘సంస్థ గురించి నీకేం తెలుసు’ అనే ప్రశ్న ఉద్దేశం పొగడమని కాదు. ఎంత అవగాహన ఉందో తెలుసుకోవడం. అంటే.. మీ లక్ష్యాలు, వాటిని చేరుకోవడానికి సంస్థ నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవడానికి ఈ ప్రశ్న వేస్తారు. అందుకు తగ్గట్టుగా సిద్ధమవాలి.
అధికారిక వెబ్‌సైట్‌లో సంస్థ వివరాలతోపాటు కోర్సు రూపకల్పన తీరు, కెరియర్‌ అవకాశాల గురించీ ఉంటుంది. విద్యతోపాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు ప్రాధాన్యం, ప్లేస్‌మెంట్స్‌ వగైరాల గురించీ ఆరా తీయాలి. అవసరమైతే ఫోన్‌ చేసీ కనుక్కోవచ్చు. దీని వల్ల కళాశాల, కోర్సులపై అవగాహన రావడమే కాదు... లక్ష్య సాధనలో మీకో స్పష్టతా వస్తుంది. ఇవి ఇంటర్వ్యూయర్లూ కనుక్కుంటారు. ఒక్కోసారి మీ నిజమైన ఆసక్తీ బయట పడొచ్చు. కాబట్టి, అమ్మాయిలు.. దీన్నో టాస్క్‌లానో, పనిలాగో భావించక కెరియర్‌ బాధ్యతగా తీసుకుని పూర్తిగా తెలుసుకోవాలి.


Advertisement


మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని