వ్యాపకంగా మొదలుపెట్టిందే వ్యాపారమైంది! - meet masoom minawala first indian fashion blogger to have attended paris fashion week in telugu
close
Published : 07/10/2021 18:52 IST

వ్యాపకంగా మొదలుపెట్టిందే వ్యాపారమైంది!

(Photo: Instagram)

నేను మాత్రమే ఎదగాలనుకోవడం స్వార్థం.. నాతో పాటు నలుగురూ ఎదగాలనుకోవడం మంచితనం! ముంబయికి చెందిన ఫ్యాషన్‌ ఇన్ఫ్లుయెన్సర్‌ మసూమ్‌ మినావాలా మెహతా రెండో కోవకు చెందుతుంది. చిన్నతనం నుంచి క్రీడలు, కళల్నే ప్రాణంగా ప్రేమించిన ఆమె.. ఎదిగే కొద్దీ ఫ్యాషన్‌పై మక్కువ పెంచుకుంది. వ్యాపకంగా ఫ్యాషన్‌ బ్లాగ్‌ను ప్రారంభించి.. దాన్నే తన కెరీర్‌గా మలచుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రముఖ ఫ్యాషన్‌/లైఫ్‌స్టైల్‌ బ్రాండ్లతో కలిసి పనిచేస్తోన్న ఆమె.. ఇటీవలే ప్రతిష్ఠాత్మక ప్యారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లోనూ మెరిసింది. ఇలా ఈ వేదికపై తళుక్కుమన్న తొలి భారతీయ ఫ్యాషన్‌ బ్లాగర్‌గా కీర్తి గడించింది మసూమ్‌. మహిళల్లో నిద్రాణమై ఉన్న ప్రతిభను వెలికి తీసి.. వారిని సాధికారత దిశగా నడిపించడమే ధ్యేయంగా క్రియేటివ్‌ కంటెంట్‌ని రూపొందిస్తోన్న ఈ ఫ్యాషన్‌ బ్లాగర్‌ ప్రస్థానమిది!

మసూమ్‌ మినావాలా మెహతా ముంబయిలో పుట్టి పెరిగింది. చిన్నతనం నుంచే టామ్‌బాయ్‌లా పెరిగిన ఆమెకు క్రీడలంటే అమితాసక్తి. ఈ క్రమంలోనే ఫుట్‌బాల్‌ను ఎక్కువగా ఇష్టపడే ఆమె.. స్కూల్లో ఫుట్‌బాల్‌ టీమ్‌కి కెప్టెన్‌గానూ వ్యవహరించింది. కళలన్నా మసూమ్‌కు విపరీతమైన ప్రేమ.. ఈ ఇష్టంతోనే బీకామ్‌ పూర్తయ్యాక ఆర్ట్స్‌ విభాగంలో డిప్లొమా కోర్సులో చేరింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ కోర్సును మధ్యలోనే వదిలేసిందామె. ఆ తర్వాత మార్కెటింగ్‌ ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసింది. ఒకానొక దశలో ఫ్యాషన్‌పై తాను పెంచుకున్న ప్రేమే.. తనను లండన్లోని ఆర్ట్స్‌ యూనివర్సిటీలో ఫ్యాషన్‌ స్టైలింగ్‌ విభాగంలో డిప్లొమా కోర్సులో చేరేలా చేసిందంటోంది మసూమ్.

‘నువ్వేం రాణించగలవు?’ అని ఎగతాళి చేశారు!

చదువు పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగొచ్చాక 2010లో ‘Miss Style Fiesta’ పేరుతో ఓ ఫ్యాషన్‌ పోర్టల్‌ని ప్రారంభించింది మసూమ్‌. అయితే ఈ క్రమంలో సమాజం నుంచి ఎన్నో విమర్శల్ని ఎదుర్కొన్నానంటోందీ ముంబయి ఫ్యాషనర్.
‘2010లో ఈ ఫ్యాషన్‌ పోర్టల్‌ని ప్రారంభించా. ఎంతో ఆసక్తితో బ్లాగ్‌ని రూపొందించా. ఫ్యాషన్‌, బ్యూటీ, లైఫ్‌స్టైల్‌, ట్రావెల్‌.. వంటి అంశాలకు సంబంధించిన సరికొత్త ట్రెండ్స్‌, చిట్కాలతో పాటు వీటికి సంబంధించి నేను పాటించే సూత్రాల్ని ఇందులో పొందుపరుస్తున్నా. అయితే నేను ఏ కంటెంట్‌ రూపొందించినా.. అది చదివే వారిలో అవగాహన పెంచేలా, వారికి ఉపయోగపడేలా, స్ఫూర్తి నింపేలా ఉండాలనుకుంటా. నిజానికి మొదట్లో దీన్ని నేనో వ్యాపకంగా మాత్రమే భావించా.. కానీ ఇదే నా కెరీర్‌గా మారిపోతుందని అప్పుడు నేను ఊహించలేకపోయా.

అయితే నేను చేసే పనిని అప్పట్లో చాలామంది విమర్శించారు. ఎందుకంటే ఆ కాలంలో ఫ్యాషన్‌ రంగంలో అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ. ‘ఆడపిల్లవు.. నువ్వేం రాణించగలవు’ అంటూ ఎగతాళి చేశారు. ‘పెళ్లయ్యాక ఎలాగూ ఈ కెరీర్‌ని మధ్యలోనే వదిలేస్తావు.. అలాంటప్పుడు నిన్ను నమ్మి ఎలా పెట్టుబడి పెట్టగలం’ అన్న వారూ లేకపోలేదు. కానీ ఇలాంటి వాళ్ల మాటలకు నేను తలొగ్గలేదు. ఆడపిల్లనైనా, పెళ్లైనా.. కెరీర్‌లో విజయవంతంగా రాణించగలనని నిరూపించాలనుకున్నా’.

వారిని ప్రోత్సహించాలని..!

‘అయినా మగవాళ్లు ఏదైనా కొత్త పని చేస్తానన్నప్పుడు తప్పు పట్టని ఈ సమాజం.. ఆడవాళ్లపై ఎందుకింత వివక్ష చూపుతుందో ఇప్పటికీ అంతుచిక్కని విషయమే! సమాజం నుంచి విమర్శల్ని ఎదుర్కొన్నప్పుడు నా కుటుంబమే నాకు అండగా నిలిచింది. నన్ను ప్రోత్సహించింది. అయితే ఈ క్రమంలో నాకు అర్థమైన విషయమేంటంటే.. నేనే కాదు.. నాలా ఎంతోమంది మహిళలు తమలో ప్రతిభ ఉన్నా సమాజం ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారన్న విషయం గ్రహించా. అలాంటి వారిని వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించడానికి Empowher పేరుతో ఓ సోషల్‌ మీడియా వేదికను రూపొందించా. దీని ద్వారా ఆర్థిక సలహాలు, బిజినెస్‌ టిప్స్‌తో పాటు గతంలో నేను ఎదుర్కొన్న పలు అనుభవాలను పోస్టులు, వీడియోల రూపంలో షేర్‌ చేస్తున్నా. అలాగే యూట్యూబ్‌ ఛానల్‌, ఇన్‌స్టా పేజీల వేదికగా కూడా ఆయా అంశాలకు సంబంధించిన చిట్కాలు, సలహాలు అందిస్తున్నా. అలాగే వీటితో పాటు ప్రస్తుతం అంతర్జాతీయంగా పేరుపొందిన పలు ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్ బ్రాండ్స్‌తో కలిసి పనిచేస్తున్నా..’ అంటూ తన ప్రస్థానాన్ని వివరించిందీ ఫ్యాషన్‌ బ్లాగర్.

ఫ్యాషన్‌ ఐకాన్‌గా..!

పేరున్న ఫ్యాషన్‌ బ్లాగర్‌గా, క్రియేటివ్‌ కంటెంట్‌ రైటర్‌గా పేరొందిన మసూమ్‌.. అంతర్జాతీయంగా పలు ఫ్యాషన్‌ వేదికల పైనా మెరిసింది. గతంలో రెండుసార్లు కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై భారతీయ ఫ్యాషన్‌ పరిమళాలు పూయించిన ఈ సొగసరి.. ఇటీవలే ముగిసిన ప్యారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లోనూ తళుక్కుమంది. ఈ క్రమంలో ప్రముఖ డిజైనర్‌ వైశాలీ షడంగులే రూపొందించిన తెలుపు రంగు సిల్క్‌ ప్యాంట్‌ సూట్‌లో ఫ్యాషన్‌ దివాగా కనిపించింది. ఈ నేపథ్యంలో మన దేశపు ఫ్యాషన్‌ పరిమళాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడం తనకు దక్కిన అదృష్టమంటోంది మసూమ్.

‘ప్యారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొనే అదృష్టం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను, మన దేశానికే పట్టుకొమ్మ అయిన చేతివృత్తుల్ని ఈ వేదికగా ప్రదర్శించడం గర్వంగా అనిపిస్తోంది. అలాగే ఇక్కడి డిజైనర్లలో దాగున్న ప్రతిభాపాటవాలను ప్రపంచానికి చాటడానికి నేనెప్పుడూ ముందే ఉంటాను..’ అంటోంది మసూమ్.

సేవలోనూ ముద్ర!


తన ఫ్యాషన్‌ బ్లాగ్‌/సోషల్‌ మీడియా పేజీల ద్వారా మహిళా సాధికారతే ధ్యేయంగా ముందుకు సాగుతోన్న మసూమ్‌.. సమాజ సేవతోనూ తన మంచి మనసును చాటుకుంటోంది. ఈ క్రమంలో..

* ‘యూఎన్‌ నేషనల్‌ స్కూల్‌ ఫీడింగ్‌ ప్రోగ్రామ్‌’ కోసం నిధుల సమీకరణలో భాగమైంది మసూమ్.

* సోషల్‌ మీడియాలో #WomenInBusiness అనే హ్యాష్‌ట్యాగ్‌ను క్రియేట్‌ చేసి.. దీని ద్వారా మహిళా సాధికారత కోసం పలు చిట్కాలు, ఇతర మహిళల సక్సెస్‌ స్టోరీస్‌ని పంచుకుంటూ మహిళల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తోంది.

* శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందరికీ చేరువ చేయడానికి ఆయా అంశాలకు సంబంధించిన చిట్కాలతో కూడిన సిరీస్‌ను సైతం రూపొందించింది.

* కొవిడ్‌ సమయంలోనూ తన సేవను కొనసాగించింది మసూమ్‌. ఈ క్రమంలో ముంబయికి చెందిన ధర్మ భారతి మిషన్ అనే స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపి.. అన్నార్తుల ఆకలి తీర్చింది.

 

వంట చేస్తా!


* తన ప్రతిభతో ఫ్యాషన్‌ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని క్రియేట్‌ చేసుకున్న మసూమ్‌కు ఇష్టమైన ఫ్యాషన్‌ డిజైనర్‌ ఎవరని అడిగితే.. మనీష్‌ మల్హోత్రా అని చెబుతోంది.

* ఖాళీ సమయాల్లో డ్యాన్స్‌ చేయడం, పెయింటింగ్స్‌ వేయడంపై ఆసక్తి చూపుతుందట ఈ ఫ్యాషన్‌ బ్లాగర్.

* వంట చేయడమన్నా తనకు మక్కువే అంటోంది మసూమ్‌. మరి, మీ ఫేవరెట్‌ ఫుడ్‌ ఏంటని అడిగితే వడాపావ్‌ అని చెబుతోంది.

* హిందీ, ఇంగ్లిష్‌, గుజరాతీ, మరాఠీ, ఫ్రెంచ్‌ భాషల్ని అనర్గళంగా మాట్లాడతానంటోంది.

* బెల్జియంలోని Antwerpకి చెందిన వజ్రాల వ్యాపారి శైలిన్‌ మెహతాను 2016లో ప్రేమ వివాహం చేసుకుంది మసూమ్‌. #Shailoom అనే హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో అప్పట్లో వీళ్ల పెళ్లి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

ఫ్యాషన్‌ బ్లాగర్‌గా, క్రియేటివ్‌ కంటెంట్‌ రైటర్గా తనదైన ముద్ర వేస్తోన్న మసూమ్‌.. ‘డిజిటల్‌ ఆంత్రప్రెన్యూర్‌ (2010)’, ‘ఇండియాస్‌ బెస్ట్‌ లగ్జరీ ఫ్యాషన్‌ బ్లాగర్‌ (2019)’, ‘మోస్ట్‌ స్టైలిస్ట్‌ బ్లాగర్‌ (2019)’.. వంటి పలు అవార్డులు సొంతం చేసుకుంది.


Advertisement


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని