ఇలా చేస్తే యాపిల్‌ ముక్కలు రంగు మారవు! - simple tips to prevent apple slices from browning
close
Published : 28/06/2021 16:23 IST

ఇలా చేస్తే యాపిల్‌ ముక్కలు రంగు మారవు!

సాధారణంగా మనమేదైనా పండుని కట్‌ చేశాక లేదంటే ఒలిచాక.. ఆ మొత్తం పండుని ఒక్కసారిగా తినలేకపోతే.. మిగిలిన ముక్కలను ఫ్రిజ్‌లో నిల్వచేసుకొని తర్వాత తినడం చాలామందికి అలవాటే. ఎందుకంటే.. ఫ్రిజ్‌లో అవి కొన్ని గంటల వరకు తాజాగా ఉంటాయి కాబట్టి..! కానీ.. యాపిల్‌ విషయంలో మాత్రం ఇది అసాధ్యమనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. యాపిల్‌ పండును ఒక్కసారి కట్‌ చేశాక, దాన్ని వెంటనే తినేయాలి.. లేదంటే.. యాపిల్‌ గుజ్జులోని పాలీఫినోల్‌ ఆక్సిడేస్‌ అనే ఎంజైమ్‌ గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి గుజ్జును బ్రౌన్‌ కలర్‌లోకి మారుస్తుంది. ఇలా ఎరుపెక్కిన యాపిల్‌ ముక్కల్ని చూస్తే అస్సలు తినాలనిపించదు. మరి, యాపిల్‌ ముక్కలు కట్‌ చేశాక కూడా రంగు మారకుండా అలాగే ఉంటే ఎంత బావుంటుందో అనుకుంటున్నారా? అయితే అందుకు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరి. ఫలితంగా కొన్ని గంటల పాటు యాపిల్‌ ముక్కలు తాజాగా ఉంటాయి. మరి, యాపిల్‌ ముక్కల్ని రంగు మారకుండా తాజాగా ఉంచే ఆ సింపుల్‌ టిప్స్‌ ఏంటో మనమూ చూసేద్దాం రండి..

* కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలపై కొన్ని చుక్కల నిమ్మరసాన్ని చల్లండి. నిమ్మరసంలోని సిట్రిక్‌ యాసిడ్‌ యాపిల్‌ ముక్కలను ఎక్కువసేపు తాజాగా ఉంచడమే కాకుండా.. వాటిని రంగు మారనివ్వదు. లేదంటే ఇలా కూడా చేయచ్చు. కప్పు నీటిలో టేబుల్‌స్పూన్‌ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంలో యాపిల్‌ ముక్కల్ని ఐదు నిమిషాల పాటు నానబెట్టినా చక్కటి ఫలితం ఉంటుంది. నిమ్మరసానికి బదులుగా పైనాపిల్‌ జ్యూస్‌ను ఉపయోగించినా అదే ఫలితాన్ని పొందచ్చు.

* ఒక కప్పు మంచి నీళ్లలో, రెండు టేబుల్‌స్పూన్ల తేనె వేసి కలపండి. ఇప్పుడు ఈ నీటిలో, కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలు వేసి కొన్ని నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల, యాపిల్‌ ముక్కలు ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి.

* కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలను ఐస్‌ నీళ్లలో కొన్ని నిమిషాల పాటు ఉంచి, బయటకు తీయాలి. ఇలా చేయడం వల్ల యాపిల్‌ ముక్కలు కాసేపటి వరకు తాజాగా ఉంటాయి.

* కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలు ఎర్రబడకుండా ఎక్కువ సేపు తాజాగా ఉండాలంటే వాటిని జిప్‌లాక్‌ బ్యాగ్‌లో బంధించాల్సిందే. యాపిల్‌ని ముక్కలుగా కట్‌ చేసిన తర్వాత వెంటనే వాటిని జిప్‌లాక్‌ బ్యాగ్‌లో పెట్టి అందులో గాలిలేకుండా ఒత్తేయాలి. ఇప్పుడు ఈ బ్యాగ్‌ను అలాగే ఫ్రిజ్‌లో పెట్టేయాలి. తద్వారా యాపిల్‌ గుజ్జులోని పాలీఫినోల్‌ ఆక్సిడేస్‌ వాతావరణంలోని ఆక్సిజన్‌తో చర్య జరపదు. ఫలితంగా యాపిల్‌ ముక్కలు ఎర్రబడకుండా జాగ్రత్తపడచ్చు.

* యాపిల్‌ కట్‌ చేయడానికి మనం ఉపయోగించే చాకు కూడా యాపిల్‌ ముక్కల్ని ఎర్రగా మార్చే అవకాశం ఉంటుంది. పాతబడిన, తుప్పు పట్టిన చాకుల్ని యాపిల్‌ కట్‌ చేయడానికి ఉపయోగిస్తే దానిపై ఉండే ఇనుము యాపిల్‌ ముక్కలపై చేరి.. ఆక్సిడేషన్‌ పద్ధతిని మరింత వేగవంతం చేస్తుంది. తద్వారా యాపిల్‌ ముక్కలు అతి త్వరగా బ్రౌన్‌ కలర్‌లోకి మారతాయి. అలా జరగకూడదంటే కొత్త చాకుల్ని ఉపయోగించడం శ్రేయస్కరం.

* కాస్త దాల్చిన చెక్క పొడిని కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలపై చల్లడం వల్ల ఆ ముక్కలు బ్రౌన్‌ కలర్‌లోకి మారకుండా జాగ్రత్తపడచ్చు. ఇందుకు దాల్చిన చెక్కలోని యాంటీఆక్సిడెంట్లే కారణం. అలాగే దాల్చిన చెక్క పొడి వల్ల యాపిల్‌ ముక్కలకు మరింత రుచి చేకూరుతుంది కూడా!!

* మరుగుతున్న నీటిలో యాపిల్‌ ముక్కల్ని ఐదు నిమిషాల పాటు ఉంచి తీయాలి. ఆపై చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా యాపిల్‌ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి. అయితే ఈ క్రమంలో యాపిల్‌ గుజ్జు మెత్తబడిపోయే అవకాశం ఉంటుంది.. కాబట్టి వంటకాలు, ఇతర బేకింగ్‌ ఐటమ్స్‌లో వాడే యాపిల్స్‌ కోసమైతే ఇలా చేయడం మంచి పద్ధతి.

గమనిక:
ఏ పండైనా సరే - సాధ్యమైనంతవరకు అప్పటికప్పుడు కట్ చేసుకుని, ఫ్రెష్‌గా తినడమే అన్ని రకాలుగా మంచిది. ఒకవేళ- యాపిల్‌ను ముందుగానే కట్ చేసేసి- వెంటనే వినియోగించలేని పరిస్థితుల్లో మాత్రమే పైన చెప్పిన పద్ధతులను పాటించడం మంచిది.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని