Amaravati: అక్రమ మట్టి తవ్వకాలను నిరసిస్తూ మందడంలో రైతులు ఆందోళన

రాజధాని (Amaravati) ప్రాంతంలో అక్రమ మట్టి తవ్వకాలను నిరసిస్తూ మందడంలో రైతులు ఆందోళనకు దిగారు. తమ స్థలాల్లో అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించారు. జోరు వానలోనూ రైతులు నిరసన కొనసాగించారు. సోమవారం అర్ధరాత్రి రాజధానిలోని ఓ ప్రజాప్రతినిధికి చెందిన అనుచరులు మందడంలో మట్టి తవ్వుతుంటే రైతులు అడ్డుకున్నారు. ఆ ప్రజాప్రతినిధి అనుచరులు తమపై దాడికి యత్నించారంటూ మంగళవారం ఉదయం రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం చర్యలు తీసుకునేంతవరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని రైతులు తేల్చి చెప్పారు. 

Published : 30 May 2023 11:48 IST

Tags :

మరిన్ని