కట్నం తీసుకుని ముఖం చాటేశాడు.. వరుడి వెంట వధువు పరుగో పరుగు!

కట్నకానుకలు తీసుకొని పెళ్లికి ముఖంచాటేసిన యువకుణ్ని వెంబడించి పట్టుకొని మరీ వివాహమాడింది ఓ యువతి. ఈ ఘటన బిహార్‌లోని నవదాలో జరిగింది. మెహకర్ గ్రామానికి చెందిన యువకుడికి, మహుళి గ్రామానికి చెందిన యువతికి 3 నెలల క్రితం వివాహం నిశ్చయమైంది. పెళ్లి చేసుకునేందుకు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ తప్పించుకు తిరుగుతున్న యువకుడిని ఆ యువతి మార్కెట్లో చూసింది. అమ్మాయిని చూసి పరుగు అందుకున్న యువకుడిని.. ఆమె కుటుంబం వెంబడించి పట్టుకుంది. చివరికి పోలీసుల సహకారంతో ఆలయంలో వివాహం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

Published : 01 Sep 2022 10:41 IST

Tags :

మరిన్ని