Chevireddy: వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నుంచి నా కుమారుడు పోటీ: ఎమ్మెల్యే చెవిరెడ్డి

వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి (Chandragiri) నియోజకవర్గం నుంచి వైకాపా (YSRCP) అభ్యర్థిగా తన కుమారుడు మోహిత్ రెడ్డి బరిలోకి దిగుతారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) ప్రకటించారు. తిరుపతి (Tirupati) సమీపంలోని శిల్పారామం వేదికగా నిర్వహించిన చంద్రగిరి నియోజకవర్గ వైకాపా ఆత్మీయ సమ్మేళనంలో చెవిరెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా జనం ముందుకు వచ్చే మోహిత్ రెడ్డిని ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

Published : 02 Apr 2023 17:01 IST

మరిన్ని