Revanthreddy: రిజర్వేషన్ల రద్దుపై భాజపా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది: రేవంత్‌రెడ్డి

రిజర్వేషన్ల రద్దు, హిందూ దేశం అనేవి ఆర్‌ఎస్‌ఎస్‌ మూల సిద్ధాంతాలని, ఆ దిశగానే మోదీ నేతృత్వంలో భాజపా సర్కార్ కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Published : 02 May 2024 09:53 IST

రిజర్వేషన్ల రద్దు, హిందూ దేశం అనేవి ఆర్‌ఎస్‌ఎస్‌ మూల సిద్ధాంతాలని, ఆ దిశగానే మోదీ నేతృత్వంలో భాజపా సర్కార్ కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth reddy) ఆరోపించారు. వెంకటాచలయ్య కమిషన్ ఏర్పాటు, రిజర్వేషన్ల రద్దుకు భాజపా నేతల ప్రకటనలే ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. ఇదే అంశంపై తాను మాట్లాడితే దిల్లీ పోలీసుల నుంచి నోటీసులు పంపారన్న రేవంత్ రెడ్డి.. భాజపా కుట్రలను తిప్పికొడతానని హెచ్చరించారు.

Tags :

మరిన్ని