Chinta Mohan: త్రీఇన్‍ వన్‍గా భాజపా - తెదేపా - వైకాపా: చింతామోహన్‍

రాష్ట్రంలో 90 శాతం మందికిపైగా ప్రజలు వైకాపాను ఇష్టపడటం లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత చింతామోహన్‍ (Chinta Mohan) విమర్శించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‍ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. భాజపా, తెదేపా, వైకాపా త్రీఇన్‍ వన్‍గా మారాయన్నారు. మరోవైపు, ఒడిశా రైలు ప్రమాదం కేంద్ర ప్రభుత్వం పొరపాటు వల్లే జరిగినట్లు ఆరోపించారు. ప్రపంచ చరిత్రలో ఇటువంటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదన్నారు.

Published : 06 Jun 2023 19:46 IST

మరిన్ని