KTR: దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయి: కేటీఆర్‌

భారత దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని.. ఆర్ధికాభివృద్ధి కన్నా రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడతారని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ వంటి చిన్న దేశాలు.. అభివృద్ధిలో దూసుకెళ్తుంటే మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటున్నామని పేర్కొన్నారు. ఒక సంస్థ, దేశం.. ప్రకృతి వనరులు, మానవ వనరుల్ని సమర్థంగా వినియోగించుకున్నపుడే  విజయవంతమవుతాయని గుర్తుచేశారు. 35 ఏళ్ల కిందట మనతో సమానంగా ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థ.. ఎలా ముందుకువెళ్లిందో యువత గమనించాలని కేటీఆర్ సూచించారు.

Updated : 02 Feb 2023 20:21 IST

Tags :

మరిన్ని