TS News: మాజీ ఎమ్మెల్యే ఉంగరం.. నిమిషాల వ్యవధిలోనే వెతికిపెట్టిన పోలీసులు

వ్యవసాయ క్షేత్రంలో పోగొట్టుకున్న ఓ ఉంగరాన్ని.. పోలీసు సిబ్బంది నిమిషాల వ్యవధిలోనే వెతికిపెట్టారు. అయితే, ఆ ఉంగరం ఓ మాజీ ఎమ్మెల్యేది కావడం ఇక్కడ గమనార్హం. భాజపా నేత, ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌.. వ్యవసాయ క్షేత్రంలో గడ్డి కోస్తుండగా ఉంగరాన్ని పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని రాచకొండ సీపీకి తెలియజేయగా, వెంటనే ఉన్నతస్థాయి సాంకేతిక బృందాన్ని పంపించారు. వారంతా ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిమిషాల వ్యవధిలోనే ఉంగరం జాడ కనిపెట్టారు. దీంతో రాచకొండ పోలీసులకు ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ధన్యవాదాలు తెలిపారు. 

Updated : 07 Dec 2022 15:03 IST

Tags :

మరిన్ని