SC: ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు, స్వయంప్రతిపత్తిపై తీర్పు రిజర్వ్‌

ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు, స్వయంప్రతిపత్తి అంశంపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామక ప్రక్రియపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం పెదవి విరిచింది. ఒక్క రోజులోనే నియామక ప్రక్రియ ఎలా పూర్తిచేశారని ప్రశ్నించింది. 24 గంటలు గడవకముందే మొత్తం నియామక ప్రక్రియ ఎలా పూర్తి చేశారని రాజ్యాంగ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సీఈసీ, ఈసీల నియామకానికి స్వతంత్ర ప్యానెల్ ఏర్పాటు చేయాలో..?వద్దో..? త్వరలో తీర్పు వెలువరించనున్నట్లు స్పష్టం చేసింది.

Published : 24 Nov 2022 19:46 IST

Tags :

మరిన్ని