close

Published : 27/08/2020 00:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
3 ఏళ్ల పసివాడు.. ప్రాణం కాపాడాడు!

ఇంటర్నెట్‌ డెస్క్: తన తోటి చిన్నారి నీటిలో మునిగిపోకుండా మూడేళ్ల పసివాడు కాపాడాడు. ఇంటి ఆవరణలోని పూల్‌లో ఆడుకుంటూ ఉండగా ఈ సంఘటన జరిగింది. బ్రెజిల్‌లోని రియోడిజనిరోలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల ఆర్ధర్‌, వారి కేర్‌టేకర్‌ కుమారుడైన మరో చిన్నారి.. పెద్దలకు తెలియకుండా తమ ఇంటిలోని ఓ పూల్‌ వద్దకు ఆడుకునేందుకు వెళ్లారు. ఆట మధ్యలో ఆ బాలుడు నీటిలో తేలుతున్న ఓ స్విమ్‌ రింగును అందుకోబోయి నీళ్లలో పడిపోయాడు. ఊపిరి ఆడకపోవటంతో కాళ్లు, చేతులూ కొట్టుకోవటం మొదలుపెట్టాడు. ప్రమాదాన్ని పసికట్టిన ఆర్ధర్‌, ఆ చిన్నారి చేతిని అందుకుని బయటకు లాగటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఈ సంఘటన దృశ్యాలు రికార్డయ్యాయి. దీన్ని  స్థానిక పోలీసులు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ఇంట్లో స్విమ్మింగ్‌ పూల్‌ ఉన్న వారు చిన్నారుల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో దీని ద్వారా గ్రహించాలని వారు కోరారు. ఇక ఆ బుడతడికి ఓ బుట్ట నిండా చాక్లెట్లు, ప్రశంసా పత్రం, ట్రోఫీ కూడా అందచేశారు. పసి వయసులోనే ఓ ప్రాణం కాపాడిన ఆర్థర్‌ను నెటిజన్లు హీరో అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.