close

Published : 13/10/2020 18:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమ్మ కోసం ఉరికిన ఐదేళ్ల ‘చిరు’త

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమ్మను కాపాడుకోవటానికి చిరుతలా ముందుకు దూకిన ఓ ఐదేళ్ల బుడతడి సాహసం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. తుపాకులు ధరించి మరీ తమ ఇంట్లోకి దూసుకు వచ్చిన దుండగులను ఏ మాత్రం భయం లేకుండా ఎదుర్కున్న ఓ వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

అమెరికా పోలీసు శాఖ విడుదల చేసిన ఈ వీడియోలో ముసుగులు ధరించిన వ్యక్తులు తలుపు కొట్టి మరీ లోపలికి ప్రవేశించారు. అక్కడున్న వారిని తుపాకులు చూపించి బెదిరించారు. అయితే డేవిడ్‌ జాన్సన్‌ అనే ఈ చిన్నారి అమ్మను, సోదరిని రక్షించుకోవటానికి ముందుకు దూకాడు.  తన వారిని కాపాడుకునేందుకు అక్కడ ఉన్న వస్తువులను వారిపైకి విసిరడాన్ని చూడవచ్చు.

అయితే ఈ సంఘటనలో  కొన్ని కాల్పులు చోటుచేసుకుప్పటికీ ఎవరికీ ఏ ప్రమాదం, నష్టం జరగకుండానే  దుండగులు వెనుతిరిగి పోయినట్టు తెలిసింది. కాగా ఈ సంఘటనతో డేవిడ్‌ సాహసానికి సోషల్‌ మీడియాతో సహా పోలీసులు కూడా ఫిదా అయ్యారు. ఆ బాలుడికి గోల్డ్‌ స్టార్‌ ఇచ్చి సన్మానించాలని పలువురు కోరుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.