
ఇంటర్నెట్ డెస్క్: మయన్మార్‌లో ఇటీవల సైనిక తిరుగుబాటు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆ దేశ పౌరహక్కుల నేత ఆంగ్‌సాన్ సూకీ, ఆ దేశ అధ్యక్షుడితో సహా పలువురు నేతలను సైన్యం నిర్బంధించింది. అంతేకాకుండా దేశ పగ్గాలు కనీసం ఓ ఏడాదిపాటు తమ ఆధీనంలోనే ఉంటాయని ప్రకటించింది. దీనిపై భారత్‌తో సహా పలు దేశాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ఈ చారిత్రాత్మక ఘటనకు ప్రత్యక్ష సాక్షి అనదగ్గ వీడియోను ఆ దేశానికి చెందిన ఓ మహిళ అనుకోకుండానే రికార్డు చేసింది. ఇదెలా జరిగిందంటే..
యాంగోన్‌ను మయన్మార్ ఆర్థిక రాజథాని అనవచ్చు.. ఇదే ఆ దేశంలోకెల్లా అతి పెద్ద నగరం కూడా. ఇక్కడ ఖింగ్ నిన్ వాయి వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తారు. ఈమె అలవాటు ప్రకారం అక్కడి సిటీ హాల్ సమీపంలో పేవ్‌మెంట్‌పై మ్యూజిక్కు అనుగుణంగా ఏరోబిక్స్ చేస్తోంది. ఇంతలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సైనికులు వెళ్లున్న మిలిటరీ వాహనాల కాన్వాయ్.. ఆమె వెనక ఉన్న రహదారి మీదుగానే తరలిపోయింది. తన వెనుకనే అన్ని వాహనాలు వెళ్లున్నా, వాయి తన పని తాను చేసుకుంటూ పోవటం గమనార్హం. ఆమె వ్యాయామంతో పాటు.. ఆ వెనుక జరిగిన దృశ్యం కూడా సదరు వీడియోలో రికార్డైంది. దీనిని ఆ మహిళ ఫేస్బుక్లో షేర్ చేస్తే..ఒక్క రోజు కూడా కాకుండానే 55 వేల లైకులు సొంతం చేసుకుంది. ఇక ఇప్పటికే 17 వేల సార్లు షేర్ అయిన ఈ వీడియోను కొన్ని లక్షల మంది చూడటంతో వైరల్ అయింది.
ఐతే, మూడు నిముషాల పాటు సాగే ఈ వీడియో నిజమైననదేనా అనే సందేహాన్ని కొందరు నెటిజన్లు వ్యక్తం చేశారు. ఇందుకు జవాబుగా.. తాను అదే ప్రదేశంలో ఇదివరకు కూడా ఎన్నో వీడియోలు తీశానని.. వాయి రుజువులతో సహా చూపించింది. సో, అనుకోకుండా రికార్డైన ఈ అరుదైన ఘటనను మీరూ చూసేయండి!
ఇదీ చదవండి..
అమెరికా భారీకాయుడు.. భారత బాహుబలి
మరిన్ని
దేవతార్చన
- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత
- ఆఫర్ కోసం చిరు, పవన్‌లకు కాల్ చేశా: కోట
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- అఫ్రిది అల్లుడవుతున్న షహీన్
- నా పేరు చెప్పుకొని డ్రింక్ తాగండి: రవిశాస్త్రి
- జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
- శాకుంతలం: దేవ్ మోహన్ ఎవరో తెలుసా..?
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్‌కి ముందే తెలుసు
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- ‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్