Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
చిన్న పార్టీల నిర్ణయాత్మక పాత్ర
పెద్ద పార్టీల ఓట్లకు గండి!
ప్రభావం చూపించనున్న స్వతంత్రులు
జమ్మూకశ్మీర్‌ ఎన్నికల్లో వూపందుకున్న ప్రచారం
శ్రీనగర్‌ నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి
మ్మూ కశ్మీర్‌లో పెద్ద పార్టీల ఓట్లకు చిన్న పార్టీలు గండి కొట్టనున్నాయి. ఇటీవల కాలంలో కొత్తగా ఏర్పాటయిన పలు పార్టీలు.. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయి. మరోవైపు.. స్థానికంగా పలుకుబడి దండిగా ఉన్న పలువురు నేతలు స్వతంత్రులుగా బరిలోకి దిగుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై ఈ అభ్యర్థులు గణనీయమైన ప్రభావమే చూపించే అవకాశం ఉంది. గత ఏడాది సెప్టెంబరులో కొన్ని చిన్న పార్టీలు మూడో ఫ్రంట్‌గా ఏర్పడ్డాయి. ఈ కూటమికి అనంతర కాలంలో పీపుల్స్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ (పీయూఎఫ్‌) అని నామకరణం చేశారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ అధికారి ఫరూక్‌ రెంజూ షా... కశ్మీర్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ను, పౌరసమాజానికి చెందిన ప్రముఖుడు డాక్టర్‌ మహ్మద్‌ అష్రఫ్‌ భట్‌ తెహ్రీక్‌ ఇ హక్‌ పార్టీని, శాసనసభలో స్వతంత్ర సభ్యుడిగా వ్యవహరించిన ఎర్‌ రషీద్‌... అవామీ ఇత్తెహాద్‌ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలతో పాటు బరిలో నిలిచే పలువురు స్థానిక అభ్యర్థుల కారణంగా ప్రధాన పార్టీలు, ముఖ్యమైన నేతల ఓట్లకు గండి పడే అవకాశం ఉంది. ఉత్తర కశ్మీర్‌లో సరిహద్దు జిల్లా అయిన కుప్వారాలోని కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పట్టు ఉన్న సజ్జాద్‌ గనీ లోన్‌ నేతృత్వంలోని పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ కూడా నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. ఇక సిట్టింగ్‌ శాసనసభ్యులైన గులామ్‌ హసన్‌ మీర్‌, ఎం.వై.తారిగామి, హకీం మహ్మద్‌ యాసిన్‌, ఎర్‌ రషీద్‌.. ఇటీవలే చేతులు కలిపారు. ఎన్నికల్లో సమన్వయంతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. యాసిన్‌, తారిగామి.. పీయూఎఫ్‌లో భాగస్వాములుగా ఉన్నారు.

పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రచారం వూపందుకుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీల్లో ఒకటైన పీడీపీ.. జమ్మూ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో.. ముఖ్యంగా చినాబ్‌ లోయలో ముస్లింల అధిక్యం ఉన్న ప్రాంతాల్లో గట్టి పోటీదారుగా అవతరిస్తోంది. ఇది కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చవచ్చు. కశ్మీర్‌ ప్రాంతంలో పీడీపీ... అధికార నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు గట్టి పోటీ ఇస్తోంది. లద్దాఖ్‌ ప్రాంతంలో భాజపా, కాంగ్రెస్‌ మధ్య పోటీ ఉంది. సంక్షిప్త సందేశాలపై నిషేధాన్ని ఎత్తివేయడం, పదవీవిరమణ వయస్సును 60కి పెంచడం, ఉద్యోగ నియామకాలకు అర్హతను 37 ఏళ్ల వయస్సు నుంచి 40కి పెంచడం వంటి విషయాలను గుర్తు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేకత అంశాన్ని అధిగమించడానికి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రయత్నిస్తోంది.

ఎన్నికలకు ముందు ఎవరితోనూ పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేసిన భాజపా... మొత్తం 87 స్థానాల్లోనూ పోటీ చేస్తామని, 44 స్థానాలకు పైగా గెల్చుకుంటామని విశ్వాసం వ్యక్తం చేసింది. ఇక కాంగ్రెస్‌... తన ప్రధాన ప్రచారకర్తగా గులాం నబీ ఆజాద్‌ను నియమించింది. 2006-08లో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు ఆయనకు వచ్చిన ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆజాద్‌.. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. మ్యానిఫెస్టోల్లో విద్యుత్‌, తాగునీరు, రహదారులు వంటి అభివృద్ధి, మౌలిక వసతుల అంశాలను పెద్ద పార్టీలు ప్రధానంగా ప్రస్తావించబోతున్నా, జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ప్రతి పార్టీకీ ప్రత్యేక రాజకీయ అజెండా ఉంది. జమ్మూకశ్మీర్‌ స్వయంప్రతిపత్తి అంశం ఆధారంగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ రాజకీయ వైఖరిని ప్రకటించనుంది. స్వయం పరిపాలన, భారత్‌-పాక్‌ సంబంధాలను బలోపేతం చేయడంపై పీడీపీ దృష్టి పెట్టనుంది. 370 అధికరణను రద్దు చేయడం, కశ్మీరీ పండిత్‌లకు పునరావాసం అంశాలపై భాజపా దృష్టి పెట్టనుంది. బహుళ సంస్కృతి, బహుళ ప్రాంత వైవిధ్యం అంశాలకు కాంగ్రెస్‌ ప్రాధాన్యం ఇవ్వనుంది.

రాష్ట్రంలో ఐదు విడతలుగా ఈ నెల 25, డిసెంబరు 2,9,14, 20 తేదీల్లో పోలింగ్‌ జరగనుంది. ఓట్ల లెక్కింపు డిసెంబరు 23న ఉంటుంది.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

ఫైనల్‌లో వారియర్స్‌

రెండోసారి సీసీఎల్‌ ట్రోఫీ గెలవాలన్న తెలుగు వారియర్స్‌ నెరవేరడానికి ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉంది. శనివారం హైదరాబాద్‌లో ఉత్కంఠభరితంగా జరిగిన రెండో సెమీఫైనల్‌లో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net