Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
నిత్యం 145 ట్రాన్స్‌ఫార్మర్లు బుగ్గి!
సగటున పది నిమిషాలకొకటి కాలుతోంది
మరమ్మతులకు రూ.కోట్లు కుమ్మరిస్తున్న డిస్కంలు
తెలంగాణలో విద్యుత్‌ సరఫరాకు కష్టాలు
ఈనాడు, హైదరాబాద్‌: ఓ వైపు కరెంటు కోతలు... మరోవైపు విద్యుత్‌ సరఫరాలో సాంకేతిక సమస్యలతో వినియోగదారులు, ముఖ్యంగా రైతులు అల్లాడుతున్నారు. తెలంగాణలో సగటున రోజుకు 145 ట్రాన్స్‌ఫార్మర్లు (విద్యుత్తు నియంత్రికలు) బుగ్గి అవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఇప్పటివరకూ ఇవి రాష్ట్రంలో దాదాపు 29 వేల వరకూ కాలిపోయాయని రెండు డిస్కంల తాజా నివేదికలే వెల్లడిస్తోండటం.. సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది. సగటున పది నిమిషాలకో ట్రాన్స్‌ఫార్మర్‌ కాలుతున్నందున వాటిని తక్షణం మార్చడానికి సర్కారు రూ.కోట్లు కుమ్మరిస్తోంది.

నిబంధనల ప్రకారం గ్రామాల్లో విద్యుత్తు నియంత్రిక కాలిపోతే 48 గంటల్లోగా కొత్తది అమర్చాలి. నగరాలు, పట్టణాలు, మండలకేంద్రాల్లోని ఇళ్లు, పరిశ్రమల కనెక్షన్లు ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు కాలితే ఒక్కరోజులోనే మార్చాలి. ఈ ప్రాంతాల్లో ఈ నిబంధన ప్రకారం తక్షణం మారుస్తున్నారు. కానీ ప్రధానంగా వ్యవసాయ కనెక్షన్లు ఉన్నవి కాలిపోతే వాటిని బయటికి తెచ్చి మరమ్మతు చేసి తిరిగి అమర్చడానికి 4 రోజుల నుంచి ఒక్కోసారి వారంపైనే పడుతోందని రైతులు వాపోతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలితే దానిని విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం) ఖర్చులతోనే అక్కడి నుంచి మరమ్మతు కేంద్రానికి తరలించి తిరిగి తీసుకెళ్లి అమర్చాలి. కానీ పొలాల్లో ఉన్నవి కాలినప్పుడు విద్యుత్‌ సిబ్బంది తక్షణం రావడం లేదని, డిస్కం వాహనం అందుబాటులో ఉంటేనే వారు పొలాల్లోకి వస్తున్నారని రైతులు వాపోతున్నారు. సొంత ఖర్చులతో వాటిని మరమ్మతుచేయించుకెళుతున్నామని రైతులు తెలిపారు.

మరమ్మతు వ్యయం తడిసిమోపెడు...: తెలంగాణ ట్రాన్స్‌కోలో హైదరాబాద్‌ కేంద్రంగా ‘దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ’(ఎస్పీడీసీఎల్‌), వరంగల్‌ కేంద్రంగా ‘ఉత్తర ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ’(ఎన్పీడీసీఎల్‌) ఉన్నాయి. గత ఏప్రిల్‌ ఒకటి నుంచి ఇప్పటివరకూ ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 10,100, ఎన్పీడీసీఎల్‌ పరిధిలో దాదాపు 19 వేల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోగా వెంటనే మార్చారు. ఎన్పీడీసీఎల్‌ పరిధిలో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్‌తో కలిపి ఐదు జిల్లాలు, ఎస్పీడీసీఎల్‌లో పరిధిలో మిగతా ప్రాంతాలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో వ్యవసాయ కనెక్షన్లు అధికంగా ఉండటం వల్ల వాటిపై విద్యుత్‌ వినియోగం ఈ ఖరీఫ్‌లో బాగా పెరిగింది. దీనివల్ల లోడు పెచ్చుపెరగడం, లైన్లు వదులుగా ఉండటం, ఇతర సాంకేతిక కారణాల వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు ఎక్కువగా కాలిపోతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. వరదలు వచ్చినప్పుడు తీర ప్రాంత గ్రామాల్లో నీటమునిగిన ట్రాన్స్‌ఫార్మర్లు కాలి పనికిరాకుండా పోతున్నాయి. ఒకసారి ట్రాన్స్‌ఫార్మర్‌ కాలితే దాని సామర్థ్యాన్ని బట్టి మరమ్మతు, రవాణ, తిరిగి అమర్చడానికి రూ.15 వేల నుంచి 20 వేల దాకా ఖర్చు అవుతోంది. ఈ ఏడాది కాలిన 29 వేల ట్రాన్స్‌ఫార్మర్లను మార్చడానికి రెండు డిస్కంలు దాదాపు రూ.55 కోట్ల దాకా వెచ్చించాల్సి వచ్చింది.

కాలితే తొందరపడొద్దు...
విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినా గ్రామాల్లో అవగాహన లేనివారు ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిందనే అనుమానంతో మరమ్మతుకు దిగుతున్నారు. ఇలాంటి తొందరపాటు వల్ల ఒక్కోసారి ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవటమే కాక మరమ్మతులకు దిగేవారి వారి ప్రాణాలకూ ముప్పు వాటిల్లుతోంది. మా డిస్కం పరిధిలో మొత్తం 2.16 లక్షల ట్రాన్స్‌ఫార్మర్లున్నాయి. కాలిన వాటిని మార్చేందుకు ఎప్పుడూ కొత్తవి సిద్ధంగా ఉంచుతున్నాం. ఎక్కడైనా కాలితే రైతులు తొందరపడకుండా మాకు సమాచారం ఇస్తే తక్షణం వాటిని పరిశీలించి మార్చేందుకు సిబ్బందిని పంపుతున్నాం.
- వెంకటనారాయణ, సీఎండీ, ఎన్పీడీసీఎల్‌
కాలుతున్నవి 3 శాతమే...
మా డిస్కం పరిధిలో 2.55 లక్షల ట్రాన్స్‌ఫార్మర్లుంటే వాటిలో కాలుతున్నది 3 శాతమే. అయినా కాలిన వాటిని వెంటనే మారుస్తున్నాం నాణ్యతలేని పరికరాల వల్ల కాలుతున్నాయనటంలో నిజం కాదు. ఇతర సాంకేతిక కారణాల వల్లనే ట్రాన్స్‌ఫార్మర్లు విఫలమవుతున్నాయి.
- రఘుమారెడ్డి, సీఎండీ, ఎస్పీడీసీఎల్‌

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net