Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
‘కొత్త’ హుషార్‌
కొత్త సంవత్సరానికి ఘనస్వాగతం పలికే సన్నాహాలు
అమ్మకాలు పెంచుకోవడానికి ఎక్సైజ్‌శాఖ కసరత్తు
ఫంక్షన్‌ హాళ్లలోనూ మద్యం విక్రయానికి అనుమతి
బార్లు, దుకాణాలకు 2 గంటల అదనపు సమయం
తాగి రోడ్డెక్కితే పట్టుకోవడానికి పోలీసుల సన్నాహాలు
పార్టీలకు దూరంగా.. సేవ బాటలో మరికొందరు
ఈనాడు - హైదరాబాద్‌
కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలకడానికి కుర్రకారు సిద్ధపడుతున్నారు. హైదరాబాద్‌లోనే కాదు ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాల్లో కూడా నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేక వినోద కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. ప్రముఖ సినీతారలు, డీజేలతో హుషారెత్తించనున్నారు. కుటుంబ సభ్యులతో సహా పాల్గొనేలా సంగీత, వినోద కార్యక్రమాలకూ ఈసారి చాలామంది పెద్దపీట వేస్తున్నారు. ఇక కొత్త సంవత్సరమంటే యువత హుషారే వేరు. ఈ సందట్లో మద్యం మ విక్రయాలను పెంచుకోడానికి ఎక్సైజ్‌ శాఖ సిద్ధమవుతోంది. ఆ ఒక్కరాత్రే 69.12 లక్షల లీటర్లు తాగించాలని ఆ శాఖ ప్రణాళికలు వేస్తుండగా.. తాగి రోడ్డెక్కగానే పట్టుకుని కేసుల సంఖ్య పెంచుకోవాలని పోలీసు శాఖ ఎదురుచూస్తోంది. మొత్తం మీద రెండిందాలా సర్కారుకు లాభమేనన్నమాట! అయితే కుర్రకారును పోలీసు భయం వెన్నాడకుండా కొందరు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీకి సొంత వాహనాల్లో వచ్చినవాళ్ల కోసం డ్రైవర్లను సమకూర్చునున్నారు. వ్యవసాయ క్షేత్రాలు, రిసార్టుల్లో అయితే ‘రాత్రి బస’ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ఇక ‘విందు’బాబుల కోసం మొబైల్‌ యాప్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆ యాప్‌ను బ్రౌజ్‌ చేస్తే విందు ప్రదేశానికి సమీపంలో ఉన్న అద్దె వాహనాలు మొబైల్‌ ఫోన్‌ తెరపై కనిపిస్తాయి. నచ్చిన వాహనాన్ని టచ్‌ చేస్తే చాలు నిమిషాల్లో చెంతకు చేరుతుంది. వీళ్లు కిలోమీటరుకు రూ.20 నుంచి 30 వరకూ వసూలు చేస్తారు.

సంవత్సరాంతానికి ‘మందోబస్తు’
ఈసారి 8 లక్షల కేసుల మద్యం అమ్ముడవుతుందని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే ఆ ఒక్క రాత్రే రాష్ట్రవ్యాప్తంగా మందుబాబులు 69.12 లక్షల లీటర్ల మద్యాన్ని తాగనున్నారన్న మాట. బీరు అమ్మకాలు 7.5 లక్షల కేసుల (58.5 లక్షల లీటర్లు) వరకు ఉండొచ్చని అంచనా. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది అంచనాలు భారీగా పెరిగాయి. 2011 డిసెంబర్‌ 31న మద్యం 7 లక్షల కేసులు, బీరు 5.76 లక్షల కేసులు.. 2012 డిసెంబర్‌ 31న మద్యం 7.7 లక్షల కేసులు, బీరు 7 లక్షల కేసులు అమ్ముడయ్యాయి.

ఫంక్షన్‌ హాళ్లకూ అనుమతులు
మద్యం విక్రయాలు పెంచే దిశగా ఎక్సైజ్‌ శాఖ దుకాణాల వేళలు పెంచబోతోంది. నిబంధనల ప్రకారం వైన్‌ షాపులను రాత్రి 10 గంటలకు, బార్లను రాత్రి 11 గంటలకు మూసివేయాలి. కానీ 31వ తేదీ రాత్రి మరో రెండు గంటలు పొడిగించబోతున్నారు. బార్లు లేని ప్రాంతాల్లో ఒక్కరోజు అనుమతితో ఫంక్షన్‌హాళ్లలో మద్యం వినియోగానికి అవకాశం ఇవ్వబోతున్నారు. జనాభా ప్రాతిపదికన ఈ లైసెన్స్‌ ఫీజులను నిర్ణయించారు. జంటనగరాల్లో రూ. 6 వేలు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు మద్యం కంపెనీలూ తమ ఉత్పత్తుల విక్రయం పెంచుకునేందుకు దుకాణదార్లకు రాయితీలు, ఖరీదైన బహుమతులు ఇస్తున్నాయి.

అనాథ పిల్లలకు అండగా వీరు..
కుర్రాళ్లంటే పబ్‌లు, డిస్కోలు, విందులు వినోదాలకే పరిమితం అనుకోవడం సహజం. కానీ, కొంతమంది యువత ఇందుకు పూర్తి భిన్నం. వీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నగరాల్లో 31వ తేదీ రాత్రి వేళ ట్రాఫిక్‌ అదుపు తప్పుతుంది. పోలీసులకు సాయం చేసేందుకు ‘వాదా ఫౌండేషన్‌’ సన్నద్ధమైంది. గతేడాది ఈ సంస్థ తరఫునే ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ నియంత్రణ చర్యల్లో పాల్గొన్నారు. ఫౌండేషన్‌ స్థాపకుడు సురేష్‌రాజు మాట్లాడుతూ.. ‘‘ఆరేళ్ల నుంచి ట్రాఫిక్‌ పోలీసులకు సాయం చేస్తున్నా. గతేడాది 15 మంది నాతో చేతులు కలిపారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరుగుతుందనుకుంటున్నా’’ అని చెప్పారు. అనాథ శరణాలయాలు, అంధ విద్యార్థుల వసతి గృహాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి అక్కడివాళ్లతో కొత్త సంవత్సరం వేడుకలు చేసుకొని వారితో ఆడిపాడే యువతరం కూడా కనిపిస్తోంది. హైదరాబాద్‌కి చెందిన ఐటీ ఉద్యోగి జి.ఎన్‌.దీపక్‌ తన మిత్రులతో కలిసి రెండేళ్లుగా హైదరాబాద్‌లోని అనాథ శరణాలయాల్లో వేడుకలు చేసుకొని అక్కడే కేక్‌ కోస్తుంటారు. తాము విందువినోదాలకు వెచ్చించే మొత్తాన్ని ఏదో ఒక సంస్థకు విరాళంగా అందించేవాళ్లూ ఉన్నారని ఓ స్వచ్ఛంద సంస్థ నిరాహకులు తెలిపారు.

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

మరోసారి నీరజ్‌పాండే దర్శకత్వంలో అక్షయ్‌కుమార్‌

బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల విడుదలై రూ.100 కోట్ల కలెక్షన్లతో భారీ........

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net