Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
అయిదేళ్లపోరాటం
అందివచ్చిన సహ చట్టం
నిరుపేదల భూములను బలవంతంగా లాక్కునే పెద్దలందరికీ హెచ్చరిక..మీ కబ్జాలకు కాలం చెల్లింది. కాదని బీరాలకు పోతే సహ చట్టంతో మీకు ఎదురుదెబ్బలు ఖాయం.
నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం పడ్కల్‌లోని సర్వే నంబరు 392లో ఉన్న 11 ఎకరాల లావణి భూములను భూపంపిణీలో భాగంగా 11 మంది పేదలకు కేటాయించారు. ఇది జరిగి రెండు దశాబ్దాలు దాటింది. ఈ మధ్య కాలంలో వర్షాలు లేకపోవడం, కొద్ది మంది లబ్ధిదారులు గల్ఫ్‌కు వలసెళ్లడంతో ఆ భూముల్లో సేద్యం కుంటుపడింది. ఇదే అదనుగా కొందరు స్థానిక రాజకీయ నాయకులు ఆ భూములను ఆక్రమించుకున్నారు. క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారుల్లో కొందరు దీనికి సహకరించారన్న ఆరోపణలున్నాయి.

ఆక్రమణల గురించి తెలుసుకున్న బాధితులు, తమకు న్యాయం చేయాలంటూ 2007 నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ఉన్నతాధికారులకు ఎన్నో అర్జీలు పెట్టుకున్నారు. అయినా... ఫలితం దక్కలేదు. మూడేళ్లు గడచిపోయాయి.

2010లో ఆ గ్రామంలో సహ చట్టంపై ‘ఈనాడు ముందడుగు’ అవగాహన సదస్సు నిర్వహించింది. కబ్జాల బాధితుల్లో కొందరు దీనికి హాజరయ్యారు. చట్టం గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత సహ రక్షణ వేదిక సభ్యులను కలిశారు. వీరి సమస్య గురించి తెలుసుకున్న వేదిక సభ్యులు, 11.01.2010న మొదటిసారిగా సహ దరఖాస్తు చేశారు. భూముల వివరాలు, ప్రస్తుతం అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయన్న సమాచారం అడిగారు. సంతృప్తికర సమాధానం రాలేదు. దాంతో నాలుగైదు సార్లు దరఖాస్తు పంపారు. పూర్తి వివరాలు రాని సందర్భాల్లో అప్పీళ్లు చేశారు. వేగంగా ఫలితం దక్కకపోయినా నిరుత్సాహపడలేదు. రెండేళ్ల పాటు యంత్రాంగంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. చివరకు ఈ కృషి ఫలించింది. అధికారులు స్పందించారు. క్షేత్రస్థాయిలో సర్వే చేశారు. వాస్తవాలను తెలుసుకున్నారు. ఆక్రమణదారుల నుంచి భూములను స్వాధీనం చేసుకుని నిజమైన హక్కుదారులకు అందించారు.

- ఆర్తి శ్రీకాంత్‌, నిజామాబాద్‌
సమాచార హక్కు చట్టానికి హ్యాట్సాఫ్‌. ‘ఈనాడు ముందడుగు’ సదస్సుతోనే చట్టం గురించి తెలిసింది.
- వెంకటేష్‌, లబ్ధిదారు
సహ చట్టం వల్లే దక్కవనుకున్న మా భూములు తిరిగొచ్చాయి. న్యాయం కోసం కొన్నేళ్ల పాటు అధికారుల చుట్టూ తిరిగాం.
- రాజుబాయి, లబ్ధిదారు

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

‘శ్రీశ్రీ’ డబ్బింగ్‌ పూర్తి

అలనాటి తెలుగు సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన భార్య విజయ నిర్మల కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ‘శ్రీశ్రీ’ చిత్రం దాదాపు పూర్తయ్యింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net