100 టీఎంసీల పంపిణీకి పక్కా ప్రణాళిక
సాగర్‌ కుడి కాలువకు 51.5 టీఎంసీలు
కృష్ణా డెల్టాకు  20.3 టీఎంసీలు
ఈనాడు, అమరావతి: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి పంపిణీపై జలవనరులశాఖ అధికారులు ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. వచ్చే ఏప్రిల్‌ వరకు ఎలా పంపిణీ చేయాలో అందులో పేర్కొన్నారు. జనవరి వరకు పంటల సాగుకు, ఆ తర్వాత తాగునీటి అవసరాలకు ఈ నీటిని విడుదల చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీలో భాగంగా ఇంతవరకు వాడుకున్న నీరు పోగా ఇక 100 టీఎంసీల వరకు ఆంధ్రప్రదేశ్‌కు దక్కుతుందని లెక్కించారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ ఏడాది సాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు కూడా వరి సాగుకు నీరు ఇస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా దాదాపు ఈ ఖరీఫ్‌ కాలంలో 80 టీఎంసీలకు పైగా నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్నారు. మిగిలిన నీటిని సాగర్‌ నుంచి తీసుకుంటారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.