ఎస్సై పిలుస్తున్నారంటూ తీసుకెళ్లి అత్యాచారం

తాజా వార్తలు

Updated : 29/05/2021 05:45 IST

ఎస్సై పిలుస్తున్నారంటూ తీసుకెళ్లి అత్యాచారం

ఒంగోలు నేరవిభాగం: స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన ఆ యువతిని ఓ అగంతుకుడు ద్విచక్ర వాహనంపై అనుసరించాడు. తనకు సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని.. ఇంట్లో వాళ్లకి చూపుతానంటూ బెదిరించాడు. తానేమీ తప్పు చేయలేదని ఆమె ధైర్యంగా బదులివ్వడంతో అతను కంగుతిన్నాడు. ఒక్కసారిగా మాట మార్చాడు. ఎస్సై పిలుస్తున్నారు.. స్టేషన్‌కు రావాలన్నాడు. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఆమె అతని బండి ఎక్కింది. కొత్త మామిడిపాలెం రోడ్డులోకి తీసుకెళ్లిన అనంతరం ఆమెను బెదిరించాడు.  అత్యాచారానికి పాల్పడి ఆనక గది వద్ద వదిలేశాడు. ఈ విషయాన్ని తనతో పాటు ఉండే స్నేహితులకు ఆ యువతి చెప్పి కన్నీటి పర్యంతమైంది. వాళ్లు అనునయించి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేలా స్థైర్యం కల్పించారు. ఒంగోలులో చోటుచేసుకుందీ సంఘటన. స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడిన యువకుడి ఉదంతంపై బాధితురాలు గురువారం రాత్రి దిశ మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు గతంలోనూ ఈ తరహా ఇంకేమైనా నేరాలకు పాల్పడ్డాడా అనే కోణంలో విచారిస్తున్నారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని