AP news: కొత్తగా ‘మహిళా పోలీసు’
close

తాజా వార్తలు

Updated : 24/06/2021 07:50 IST

AP news: కొత్తగా ‘మహిళా పోలీసు’

పోలీసు శాఖలో అంతర్భాగంగా గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శులు ఇకపై ఏపీ పోలీసు శాఖలో అంతర్భాగం కానున్నారు. వారిని ‘మహిళా పోలీసు’గా పరిగణించనున్నారు. పోలీసు విధులు నిర్వహించేందుకు అవసరమైన శిక్షణ వీరికి ఇవ్వనున్నారు. ఈ మేరకు వారి సర్వీసు నియమావళిలో పలు మార్పులు తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది. వాటి ప్రకారం మహిళా కానిస్టేబుళ్లు ధరించే పోలీసు యూనిఫామ్‌నే ‘మహిళా పోలీసులు’ ధరించాలి. వివిధ చట్టాల అమలుకు సంబంధించి కానిస్టేబుళ్లకు ఉన్న అధికారాలే వీరికి దఖలు పడతాయి. మహిళా పోలీసు.. ఆమె పనిచేస్తున్న గ్రామంలో స్థానిక పోలీసుస్టేషన్‌ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తారు. వీరికి పదోన్నతులు కల్పించేందుకు ‘అదనపు హెడ్‌కానిస్టేబుల్‌’ పోస్టులు సృష్టించనున్నారు. ఈ మేరకు చట్టాల్లోని మార్పులు తీసుకురానున్నారు. ఈ వివరాలన్నింటినీ పేర్కొంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ బుధవారం ఉత్తర్వులిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని