పాజిటివిటీ రేటు తగ్గుముఖం
close

ప్రధానాంశాలు

పాజిటివిటీ రేటు తగ్గుముఖం

కొత్తగా 6,770 మందికి కరోనా
58 మంది మృతి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వరుసగా రెండో రోజూ 6-7 శాతం లోపు పాజిటివిటీ రేటు నమోదైంది. ఏప్రిల్‌ రెండో వారంలో కరోనా మలి దశ ఉద్ధృతి మొదలైన తర్వాత.. అదే నెల 23న రికార్డు స్థాయిలో 25.81 శాతం పాజిటివిటీ రేటు వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు 20-25 శాతం మధ్య కొనసాగుతూ ఈ నెల ఒకటో తేదీ నాటికి 12.06 శాతానికి తగ్గింది. ఆదివారం నాటికి అది 6.58 శాతానికి చేరింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 1,02,876 నమూనాలను పరీక్షించగా 6,770 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. మరో 58 మంది మృతి చెందారు. మొత్తం కేసులు 18,09,844కు, మరణాలు 11,940కు చేరాయి. చిత్తూరు జిల్లాలో కొవిడ్‌ మరణాలు తగ్గట్లేదు. 24 గంటల్లో ఇక్కడే 12 మంది చనిపోయారు. తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో కేసుల ఉద్ధృతి తగ్గింది. కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. తాజాగా 12,492 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఫలితంగా క్రియాశీల కేసులు బాగా తగ్గాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 85,637 క్రియాశీల కేసులున్నాయి. ఇప్పటివరకూ 2,04,50,982 నమూనాలను పరీక్షించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని