206 కేంద్రాల్లో రేపు పరిషత్‌ ఓట్ల లెక్కింపు

ప్రధానాంశాలు

206 కేంద్రాల్లో రేపు పరిషత్‌ ఓట్ల లెక్కింపు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. దీనికోసం 13 జిల్లాల్లో 206 కౌంటింగ్‌ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. వీటిలో 958 హాళ్లలో ఓట్ల లెక్కింపునకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా కలెక్టర్లు, అధికారులను సమాయత్తం చేశారు. ఓట్లు ఏ విధంగా లెక్కించాలనే దానిపై అధికారులు సిబ్బందికి సూచనలు చేశారు. ఈ ప్రక్రియను గడువులోగా పూర్తిచేసి, ఆ తర్వాత విజేతలను ప్రకటించేలా ఏర్పాట్లు చేశారు.

పరిశీలకులుగా ఐఏఎస్‌ అధికారులు..: ఓట్ల లెక్కింపు ప్రక్రియ పరిశీలకులుగా 12 జిల్లాలకు ఐఏఎస్‌ అధికారులను, ఓ జిల్లాకు ఐఎఫ్‌ఎస్‌ అధికారిని నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఆదేశాలు జారీచేశారు. కేఆర్‌బీహెచ్‌ఎన్‌ చక్రవర్తి (శ్రీకాకుళం), కాంతిలాల్‌ దండే (విజయనగరం), ఎ.ఎండీ.ఇంతియాజ్‌ (విశాఖపట్నం), ఎం.హరిజవహర్‌లాల్‌ (తూర్పుగోదావరి), ఎస్‌.సత్యనారాయణ (పశ్చిమగోదావరి), డి.మురళీధర్‌రెడ్డి (కృష్ణా), పి.లక్ష్మీనరసింహం (గుంటూరు), సీహెచ్‌.శ్రీధర్‌ (ప్రకాశం), పి.బసంత్‌కుమార్‌ (నెల్లూరు), వి.చినవీరభద్రుడు (చిత్తూరు), కె.హర్షవర్దన్‌ (అనంతపురం), బీఎం దివాన్‌మైదీన్‌ (కడప), ఎం.ప్రభాకర్‌రెడ్డి (కర్నూలు)ను పరిశీలకులుగా నియమించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని