టీకా, ఆక్సిజన్‌లకు కేంద్రంపైనే ఆధారం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా, ఆక్సిజన్‌లకు కేంద్రంపైనే ఆధారం

ఈ విషయం ప్రతిపక్ష నేతకు తెలియదా?: సజ్జల

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో రోజూ వస్తున్న కొవిడ్‌ కేసులు ఆందోళనకరంగా ఉన్నాయి. నియంత్రించే లోగానే వ్యవస్థను నిస్సహాయ స్థితిలోకి నెట్టడానికి కారణం.. ఆ వైరస్‌కు ఉన్న వేగం. దీన్ని ఎదుర్కొనే సర్వశక్తులు మన వద్ద లేవు. అయినప్పటికీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం సమన్వయంతో ఇతర రాష్ట్రాలు, పలు దేశాల కంటే అత్యుత్తమంగా పనిచేస్తోంది’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘కొవిడ్‌ టీకాల ఉత్పత్తి, పంపిణీ కేంద్రం పరిధిలో ఉంటుంది. ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ వంటివి కేంద్రం సహకారం లేకుండా తీసుకోలేం. ఇవన్నీ తెలిసినా సరే, తెదేపా అధినేత చంద్రబాబు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో.. ప్రభుత్వం టీకాలు ఎందుకు వేయడం లేదని, ప్రజలను గాలికి వదిలేసిందని ఆరోపణలు చేశారు. ఇవి కేంద్ర పరిధిలోనివని ఆయనకు తెలియదా? గతంలో ఈ కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వామి కదా? వెళ్లి ఎందుకు మాట్లాడరు?’ అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో నిత్యం 6 లక్షల మందికి టీకాలు వేసే యంత్రాంగం ఉంది. వ్యాక్సిన్‌ కోసం సీఎం, కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. కొవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడంతో రాష్ట్రంలో 90 శాతం మందికి ప్రయోజనం కలుగుతోంది. ఆక్సిజన్‌ కోటాను పూర్తిగా వాడుకునేందుకు క్రయోజనిక్‌ ట్యాంకర్ల దిగుమతికి ప్రయత్నాలు చేస్తున్నాం. పేదలు రోడ్డున పడకుండా వివిధ పథకాల రూపంలో ప్రభుత్వం నగదు బదిలీ చేస్తోంది. రేషన్‌ కార్డుదారులు ఒక్కొక్కరికి పది కిలోల చొప్పున బియ్యం ఇస్తోంది’ అని రామకృష్ణారెడ్డి వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని