కాకినాడ మేయర్‌పై అవిశ్వాసం?

ప్రధానాంశాలు

కాకినాడ మేయర్‌పై అవిశ్వాసం?

తెదేపా అసమ్మతి, ఇతర కార్పొరేటర్లతో వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి రహస్య భేటీ

ఈనాడు, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్‌, ఒకటో ఉప మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి వైకాపా కసరత్తు చేస్తోంది. ప్రస్తుత తెదేపా మేయర్‌ సుంకర పావని, ఒకటో ఉప మేయర్‌ కాలా సత్తిబాబును పీఠం నుంచి దింపే చర్యలకు పదును పెడుతోంది. 2017లో ఎన్నికైన మేయర్‌ ఇప్పటికే నాలుగేళ్లు పూర్తిచేసుకోవడంతో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం ఉంది. దీంతో కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కొందరు తెదేపా అసమ్మతి, భాజపా కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. మొత్తం 44 మంది కార్పొరేటర్లకు గాను 34 మంది హాజరై సంతకాలు చేసినట్లు సమాచారం. ఆగస్టు 7న జరిగిన రెండో ఉప మేయర్‌ ఎన్నికలో అసమ్మతి కార్పొరేటర్లు వైకాపా పక్షాన నిలవడంతో ఎమ్మెల్యే చెప్పిన వ్యక్తినే పీఠం వరించింది. ఇప్పుడూ అదే పునరావృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని