దాడిపై కేంద్ర హోంశాఖకు తెదేపా ఫిర్యాదు

ప్రధానాంశాలు

దాడిపై కేంద్ర హోంశాఖకు తెదేపా ఫిర్యాదు

ఈనాడు, దిల్లీ: చంద్రబాబు ఇంటిపై వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్‌, అతని అనుచరులు చేసిన దాడిపై తెదేపా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. సోమవారం ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లాను కలిసి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ వినతిపత్రం సమర్పించారు. దాడికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను చూపించారు. జడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడి ఇంటిపైకి దుండగులు దాడికి దిగినప్పటికీ పోలీసులు ఆపే ప్రయత్నం చేయలేదన్నారు.. చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో పోలీసుల పాత్రపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబునాయుడికి సంబంధించిన భద్రత విషయంలో గత రెండేళ్లుగా లోపాలు కనిపిస్తున్నాయని, అందువల్ల దానిపై సమీక్ష నిర్వహించి కట్టుదిట్టం చేయాలని కనకమేడల హోంశాఖ కార్యదర్శిని కోరారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుంటామని అజయ్‌భల్లా హామీ ఇచ్చినట్లు కనకమేడల రవీంద్రకుమార్‌ ఆ తర్వాత విలేకర్లతో చెప్పారు. ఈ విషయంలో అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. వీలైతే ప్రధాని, హోంమంత్రులను కలుస్తామన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని