ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో అంధకారం

ప్రధానాంశాలు

ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో అంధకారం

మాజీ మంత్రి దేవినేని ఉమా

గొల్లపూడి, మైలవరం, న్యూస్‌టుడే: ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం అంధకారంగా మారుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆదివారం కృష్ణా జిల్లా విజయవాడ గ్రామీణ మండలం కొత్తూరు తాడేపల్లి, మైలవరం మండలం కీర్తిరాయునిగూడెంలలో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల తెదేపా హయాంలో విద్యుత్‌ కోతలు లేవని.. ఇప్పుడు లాంతర్లు, కొవ్వొత్తుల అవసరమేర్పడిందన్నారు. అందుబాటులో ఉన్న ప్రాజెక్టులను విస్మరించి కమీషన్ల కోసం అధిక ధరలకు బయట రాష్ట్రాల నుంచి విద్యుత్‌ కొంటున్నారని విమర్శించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని