ఎంపీ మాలోత్‌ కవితకు జైలుశిక్ష

ప్రధానాంశాలు

ఎంపీ మాలోత్‌ కవితకు జైలుశిక్ష

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణలోని మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవితకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు 6 నెలల జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ శనివారం తీర్పు వెలువరించింది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఓటర్లకు డబ్బు పంపిణీ చేసినట్లు కేసు నమోదైంది. ఈ కేసులోనే కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఎంపీ కవిత వెంటనే రూ.10 వేల జరిమానా చెల్లించారు. ఆమె అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని