గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ల నియామకంపై యథాతథ స్థితి

ప్రధానాంశాలు

గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ల నియామకంపై యథాతథ స్థితి

  హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ

ఈనాడు, అమరావతి: గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్ల నియామకం విషయంలో హైకోర్టు యథాతథ స్థితి ఉత్తర్వులు జారీచేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు శనివారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. విచారణను గురువారానికి వాయిదా వేశారు. హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తమను విధులు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొంటూ ఏపీ గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ దాసరి రాజ మాస్టార్‌తో పాటు పలు జిల్లాల గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లు వ్యాజ్యం దాఖలు చేశారు. తమ స్థానంలో కొత్తగా ఛైర్మన్లను నియమించినట్లు ఓ పత్రిక ఈ నెల 18న వార్తా కథనాన్ని ప్రచురించిందని పేర్కొన్నారు. కొత్తవారికి బాధ్యతలు అప్పగించకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలని కోరారు. తమను ఛైర్మన్లుగా కొనసాగాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం కోర్టుధిక్కరణ కిందకు వస్తుందని వివరించారు. ఈ ఏడాది మే 4న హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తమను ఛైర్మన్లుగా కొనసాగేలా ఆదేశించాలని అభ్యర్థించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని