ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీ పర్యటన రద్దు

ప్రధానాంశాలు

ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీ పర్యటన రద్దు

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన దిల్లీకి వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే శుక్రవారం రాత్రి సీఎం పర్యటన రద్దయింది. ఉదయం సీఎం వ్యాయామం చేస్తుండగా కాలు బెణికిందని, ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. ‘వామపక్ష తీవ్రవాదం’పై ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి ఆయన హాజరు కావాల్సి ఉంది. హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ ఆదివారం దిల్లీలో జరిగే సమావేశానికి వెళ్లనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని