జీవన మాధుర్యం కష్టాలతో సహచర్యం
close

ప్రధానాంశాలు

జీవన మాధుర్యం కష్టాలతో సహచర్యం

ప్రయాణికులను ఎక్కించుకుని, గుండెల నిండా ధైర్యం నింపుకొని ఆటో నడుపుతున్న ఈ మహిళ పేరు మాధురి. సికింద్రాబాద్‌లోని పార్శిగుట్ట ప్రాంతానికి చెందిన ఈ మహిళ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్తతో మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. అయినా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోని ఆమె.. పార్శిగుట్టలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తన తల్లి, ఇద్దరు పిల్లల పోషణకు ఆటో డ్రైవరుగా మారారు. ఆటో ఈఎంఐ, ఇంటి అద్దె, కుటుంబ అవసరాలు, పిల్లల చదువుల కోసం ప్రతి నెలా రూ.20 వేల వరకు ఖర్చవుతోంది. ప్రతి రోజు ఆటో ద్వారా వచ్చే డబ్బులు ఖర్చులకూ సరిపోవడం లేదని, పిడుగులా వచ్చి పడిన కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా మరిన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయని చెబుతున్నారు మాధురి. కరోనా దృష్ట్యా ప్రభుత్వం ఆర్థిక సహాయం, రెండు పడక గదుల ఇంటిని అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

-ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని