తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
Pragyajaiswal: ప్రగ్యా ప్రమేయం లేకుండానే బంపర్‌ ఆఫర్‌ చేజారిందా?

హైదరాబాద్‌: కెరీర్‌లో విజయాన్ని సొంతం చేసుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు నటి ప్రగ్యాజైశ్వాల్‌. ప్రస్తుతం ‘అఖండ’ ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీగా పాల్గొంటున్న ప్రగ్యా గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అనుకోని కారణాల వల్ల తన ప్రమేయం లేకుండానే ఓ బంపర్‌ ఆఫర్‌ చేజారిందట. 

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అంతిమ్‌: ది ఫైనల్‌ ట్రూత్‌’. మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్‌ శర్మ కీలకపాత్ర పోషించారు. గ్యాంగ్‌స్టర్స్‌, పోలీసులకు మధ్య జరిగే పోరాటాల కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్‌ పోలీస్‌ అధికారిగా కనిపించారు. అయితే, సల్మాన్‌ అభిమానులను దృష్టిలో ఉంచుకొని ఆయనపై ఓ రొమాంటిక్‌ సాంగ్‌ చిత్రీకరించాలని మొదట చిత్రబృందం భావించిదట. ఆ పాటలో సల్మాన్‌ సరసన డ్యాన్స్‌ చేయడానికి నటి ప్రగ్యాజైశ్వాల్‌ని టీమ్‌ సంప్రదించగా.. ఆమె ఓకే కూడా అన్నారట. తీరా సినిమా షూట్‌ ప్రారంభమయ్యాక.. సీరియస్‌ కంటెంట్‌లో రొమాంటిక్ సాంగ్‌ ఉండకపోతేనే బాగుంటుందని టీమ్‌ నిర్ణయించుకొని ప్రగ్యాకి తెలియజేశారట. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఆమె టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పినట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు.. ఈ ఆఫర్‌ ప్రగ్యా చేతికి వచ్చి ఉంటే బాలీవుడ్‌లోనూ ఆమెకు మంచి గుర్తింపు వచ్చి ఉండేదని నెటిజన్లు చెప్పుకొంటున్నారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.