తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
Param Bir Singh: ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ పరంబీర్​ సింగ్​కు సీఐడీ సమన్లు

ముంబయి: ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ పరమ్‌బీర్​‌ సింగ్​కు మహారాష్ట్ర నేర దర్యాప్తు విభాగం(సీఐడీ) సమన్లు జారీ చేసింది. సోమవారం లేదా మంగళవారం నవీ ముంబయిలోని బేలాపూర్‌లో ఉన్న ఏజెన్సీ ఎదుట హాజరుకావాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ముంబయికి చెందిన కేతన్​ తన్నా, సోనూ జలాన్​, రియాజ్​ భాటియాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బలవంతపు వసూళ్లకు సంబంధించి జులై 30న పరంబీర్​సింగ్​తోపాటు మరో 29 మందిపై ఠాణే పోలీస్​ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో పరమ్‌బీర్‌ పాత్ర ఏమేర ఉందో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నం చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఓ కొన్ని ప్రశ్నలను కూడా సిద్ధం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

పరమ్​బీర్​సింగ్​పై జారీ చేసిన నాన్​బెయిలబుల్ వారెంట్​ను ఠాణే కోర్టు శుక్రవారం రద్దు చేసింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఠాణే పోలీస్‌ స్టేషన్​లో పరమ్​బీర్​ సింగ్ హాజరయ్యారు​. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలతో కూడిన ఎస్​యూవీ నిలిపివేత, వ్యాపారవేత్త మన్‌సుఖ్​ హిరేన్‌ హత్య కేసులో మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్టయ్యారు. ఆ తర్వాత ముంబయి పోలీసు కమిషనర్‌గా ఉన్న పరమ్‌బీర్‌ సింగ్‌ను మహారాష్ట్ర సర్కార్‌ బదిలీ చేసింది. అప్పటి నుంచి ఆయన అదృశ్యమయ్యారు. ఈ ఏడాది మే తర్వాత ఒక్కసారి కూడా కార్యాలయానికి వెళ్లలేదు.

 

Read latest National - International News and Telugu News

 


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.