
తెలంగాణ
ఈ వ్యక్తి చేతిలో కనిపిస్తున్నది మాల అనుకుంటే మీరు పొరపడినట్లే.. అదంతా వరి ధాన్యం. రైతులు అమ్మకానికి తీసుకొస్తున్న వరి ధాన్యం వర్షాలకు తడుస్తుండటంతో మొలకలు వస్తున్నాయి. మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఓ రైతు ఆరబోస్తుండగా ఇలా మాలలా కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల పరిధిలోని అవుటర్ రింగు రోడ్డు వద్ద కనిపించింది ఈ దృశ్యం.
-ఈనాడు, హైదరాబాద్